సింగరేణి ఎన్నికల్లో భారీగా నమోదవుతున్న పోలింగ్ శాతం

Published : Oct 05, 2017, 12:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
సింగరేణి ఎన్నికల్లో  భారీగా నమోదవుతున్న పోలింగ్ శాతం

సారాంశం

ప్రశాంతంగా కొనసాగుతున్న సింగరేణి ఎన్నికలు ప్రస్తుతం 52 శాతంగా  నమోదైన ఓటింగ్ శాతం   


సింగరేణి సంస్ఠలో గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కార్మికులు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ తో పాటు రాష్ట్రంలోని వివిద జిల్లాల్లోని సింగరేణి ఏరియాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మొత్తంగా 52 శాతం పోలింగ్ నమోదైంది. 
ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓటు వేయడానికి వచ్చే కార్మికులను సంస్థ గుర్తింపు కార్డ్ తప్పనిసరి గా తీసుకురావాలని సూచిస్తున్నారు.
 ఈ ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్ లలో  52,534 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకొనున్నారు.  సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఆ తర్వాత డివిజన్ ల వారిగా కౌంటింగ్ కూడా జరుగుతుంది. సాయంత్రానికి  పోటీలో 8 సంఘాలు భవితవ్యం తేలనుంది.
 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)