
సినీ పరిశ్రమకు డ్రగ్స్ కేసు మారని మచ్చలా తయారవుతుంది. గత పది రోజుల పాటు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ సినీ తారలను సిట్ బృంద విచారించిన విషయం తెలిసిందే, ఇప్పటి వరకు చాలా మంది సినిమా పెద్దలు ఈ విషయం పై మాట్లాడారు, ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ముఖ్య మంత్రి కి ఒక వినతి పత్రాన్ని ట్వీట్టర్ ద్యారా పోస్టు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫిల్మ్ ఇండస్ట్రీ రూపొందించిన వినతి పత్రాన్ని పవన్ కళ్యాణ్ షేర్ చేశారు. అందులో ఇలా పెర్కోన్నారు.. రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చిన ముందు అండగా నిలిచేది సినిమా ఇండస్ట్రీ, అయితే మాకు (ఇండస్ట్రీ) కి కష్టం వస్తే సమాజం నుండి మీడియా నుండి కొంత సానుభూతి కొరుకుంటున్నామని తెలిపారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం నడుస్తుందని వెలుగులోకి తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వానికి ధన్యవాధాలు, కానీ సినిమా ఇండస్ట్రీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని విచారణను కొంత హుందాతనంగా చేయ్యాల్సిందిగా వారు కోరారు. సినిమా పరిశ్రమ పై ఈ డ్రగ్స్ ప్రభావం పూర్తిగా నిరోధించడానికి మా వంతు సహాకారం తప్పకుండా అందిస్తామని, డ్రగ్స్ వ్యవహారం నగరంలో లేకుండా తరిమికొట్టాలని వారు సూచించారు.
ఇదే పత్రాన్ని పవన్ కళ్యాణ్ తన ట్వీట్టర్ ద్వారా పోస్టు చేశారు, గౌవరనీయులైనా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వినతి పత్రం అంటూ ఆయన ట్యాగ్ చేశారు. మీరూ చూడండి.