H-1B వీసా కోసం 21లక్షల మంది దరఖాస్తు చేశారు..!

First Published Aug 1, 2017, 1:43 PM IST
Highlights
  • 11 సంవత్సరాలలో 21లక్షల మంది దరఖాస్తు
  • హైక్వాలిఫైడ్ కానివారి దరఖాస్తుల తిరస్కరణ

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా స్థిరపడాలంటే.. H-1B వీసా  చాలా అవసరం. అందుకే ప్రతి సంవత్సరం లక్షల మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఈ వీసా కోసం దరఖాస్తు చేస్తుంటారు. వారిలో కొందరు మాత్రమే ఈ వీసాను దక్కించుకోగులగుతున్నారు. కాగా.. గత 11 సంవత్సరాలలో ఇప్పటి వరకు 21లక్షల మంది భారతీయులు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారట. ఈ విషయాన్ని సంబంధిత కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

 

 దరఖాస్తు చేసుకున్నవారిలో  హైక్వాలిఫైడ్ కానివారి దరఖాస్తులను తిరస్కరించినట్లు యూఎస్ సీఐఎస్( యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసు) తెలిపింది. ధరఖాస్తు చేసుకున్న వాళ్లందరూ.. డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలని ..వారీ  కనీస జీతం 92,317 డాలర్లుగా ఉండాలని వారు తెలిపారు.

 

ఈ 11 సంవత్సరాలలో H-1B వీసా కోసం  చైనాలో 2,96,313, ఫిలిప్పీన్స్ లో 85,918, సౌత్ కొరియాలో 77,359 మంది, కెనడాలో 68,228మంది దరఖాస్తు చేసుకున్నట్లు వారు చెప్పారు. వీసాను పొందిన వారిలో ఎక్కువ మంది 25 నుంచి 34 వయసులోపు వారు ఉన్నారని వారు తెలిపారు.

click me!