
భారత మహిళ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కు ప్రపంచ కప్ తరువాత పలు ప్రోత్సహాకాలు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు అందజేసింది. మరో 600 చదరపు గజాలు స్థలం కూడా అందించింది. నేడు మిథాలీకి పుల్లెల గోపిచంద్ అకాడమీ లో బిఎండబ్యూ కారుని బహుకరించారు. ఈ కారును చాముండేశ్వర నాథ్ అందించారు.
ఈ కార్యక్రమానికి మిథాలీ, చాముండేశ్వర్ నాథ్ తో పాటు గోపి చంద్ కూడా హాజరయ్యారు.
గొపిచంద్ మాట్లాడుతూ ప్రపంచ వరల్డ్ కప్ లో ఇండియా మహిళ టీం మంచి ప్రదర్శన కనబర్శించిందని, ప్రపంచ కప్ ఫైనల్ కి చేరుకోవడం భారత క్రీడల్లో ప్రారంభం మాత్రమే అని ఆయన అన్నారు. దేశంలో ఉన్న క్రీడాకారులకు మిథాలీ లాంటి వాళ్ళు ఆదర్శం అవుతారని పెర్కోన్నారు.
కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతు చాముండేశ్వర్ నాథ్ దేశంలోని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తీరు చాలా అద్బుతమని అన్నారు. ఆయన ఇప్పుడే కాదు చాలా కాలం నుండి మహిళ క్రికెట్ కు అండగా ఉంటు వస్తున్నారని తెలిపింది. ప్రపంచ కప్ తరువాత మహిళ క్రికెట్ జట్టు కు మంచి ఆదరణ లభించిందని ఆమె పెర్కొంది. రానున్న రోజుల్లో నేను మరింత బాగా ఆడటానికి ప్రయత్నిస్తానని తెలిపారు. తనకి సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికి మిథాలీ ధన్యవాదాలు తెలిపారు.