బడికి వచ్చిన దుప్పి పిల్ల (వీడియో)

Published : Jan 28, 2018, 06:04 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
బడికి వచ్చిన దుప్పి పిల్ల (వీడియో)

సారాంశం

పాఠశాల గదిలో దుప్పి పిల్ల  

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని మోర్దాబాద్‌లో ఓ  వింత సంఘటన చోటుచేసుకుంది. చిన్నారులు ఉండాల్సిన ఓ పాఠశాల గదిలోకి ఓ చిన్న దుప్పి పిల్ల ప్రవేశించింది.  తరగతి గది కిటికీ అద్దాలు పగులగొట్టుకుని లోపలికి వచ్చిన దుప్పిపిల్ల గదిలోని బ్లాక్ బోర్డు చుట్టూ కలియతిరుగుతూ కనిపించింది.  బైటికి ఎలా పోవాలో తెలియక.. గదిలోనే బిక్కుబిక్కుమంటూ తిరిగింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మొత్తానికి దీన్ని గమనించిన పాఠశాలయాజమాన్యం.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు దుప్పిని పట్టుకుని మళ్లీ అడవిలోనే వదిలిపెట్టారు.

 

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)