అమెరికాలో తెలంగాణ సాఫ్ట్ వేర్ అనుమానాస్పద మృతి

First Published Jan 28, 2018, 2:28 PM IST
Highlights
  • అమెరికాలో తెలంగాణ టెకీ అనుమానాస్పద మృతి 
  • స్వస్థలానికి మృతదేహాన్ని తీసుకురావడానికి మంత్రి హరిష్ రావు చొరవ

అమెరికాలోని డల్లాస్ లో తెలంగాణ చెందిన ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మూడు రోజుల క్రితమే జరగినప్పటికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   

సిద్ధిపేట పట్టణంలోని ప్రశాంత్ నగర్ కు చెందిన వెంకన్న గారి కృష్ణ చైతన్యకు అమెరికాలోని కాగ్నిజెంట్ సంస్థలో ఉద్యోగం రావడంతో మూడు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లాడు.  అతడికి మూడు నెలల క్రితం డల్లాస్ లోని సౌత్ వెస్ట్ ఏయిర్ లైన్స్ లో ఉద్యోగం రావడంతో అందులో చేరిపోయాడు. డల్లాస్ లోనే ఓ ఇంట్లో పెయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు. అయితే అతడు గత శుక్రవారం నుండి తన రూం లోంచి బయటకు రాకపోతుండటంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రూం తలుపులు బద్దలుగొట్టి లోపటికి వెళ్లి చూడగా మంచం మీద కృష్ణ చైతన్య చనిపోయి పడి ఉన్నాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని ఫోస్టుమార్టం కోసం హాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఉన్నత ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన కొడుకు సుఖంగా జీవిస్తాడని ఆశించామని, ఇలా విగతజీవుడిగా తిరిగి వస్తాడని తాము అనుకోలేదంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

 కృష్ణ చైతన్య మృతిపై సమాచారం అందుకున్న తెలంగాణ ఎన్ఆర్ఐ విభాగం సభ్యులు గోలి మోహన్, శ్రీధర్ మాదవనేనిలు మృతదేహాన్ని స్వస్థలానికి పంపే ఏర్పాట్లు  చేస్తున్నారు. వీరికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి హరీష్ పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు.  

click me!