టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కి జనాల ఝలక్ (3 వీడియోలు)

Published : Oct 07, 2017, 08:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కి జనాల ఝలక్ (3 వీడియోలు)

సారాంశం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని మేడిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. ఫార్మసిటీ భూ సేకరణ బలవంతంగా చేపడుతున్నారని గత కొన్ని రోజులుగా గ్రామస్థుల ఆందోళన చేస్తున్నారు. అయితే   త్వరలో ఈ ప్రాంతంలో కేటీఆర్ పర్యటన ఉన్నందున మేడిపల్లి హై స్కూల్ గ్రౌండ్  పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ని గ్రామస్తులు అడ్డుకున్నారు. 
తమ కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా ఫార్మా సిటీ భూముల సేకరణ జరుగుతోందని ఎమ్మెల్యే పై  గ్రామస్థులు మండిపడ్డారు. దీంతో గ్రామస్థులకు ఎమ్మెల్యే వర్గియిలకు మధ్య తోపులాట జరిగి ఉద్రక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించారు. గ్రామస్థుల ఆందోళన చేస్తుండగానే ఎమ్మెల్యే అక్కడినుంచి వెనుదిరిగారు. 
 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)