
సంగారెడ్డి : పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో పడి ఓ యువ జంట గల్లంతైంది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ బోరబండ ప్రాంతానికి చెందిన రెండు యువ జంటలు శనివారం సింగూరు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. అందులో ఓ జంట సింగూరు ప్రాజెక్టు దిగువన ఉన్న జలవిద్యుత్ కేంద్రం వద్ద నీటిలోకి దిగి సరదాగా ఆడుకుంటుండగా కాలు జారి ఇద్దరు బాగా లోతులోకి పడ్డారు. వారికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యారు. దీంతో భయపడిన మరో జంట అక్కడి నుంచి పరారైంది. గల్లంతైన వారు నజీరుద్దీన్ (25), షరీంబేగం(19)గా గుర్తించారు. మరో జంట వివరాలు తెలియరాలేదు. నజీరుద్దీన్ జిల్లాలోని రాయికోడ్ మండలం ఎన్కేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అని, వారు హైదరాబాద్ బోరబండలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. గల్లంతైన జంట కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనులని ఆపమని జాతీయ హరిత ట్రిబ్యునల్ స్టే పై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణ , అటవీ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు కొనసాగించడం చట్ట విరుద్దమని, అందువల్ల వెంటనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ స్టే విధించిన విషయం తెలిసిందే.
మిషన్ భగీరథ కార్యక్రమంతో ఈ ప్రాజెక్టు పనులు అనుసంధానమై ఉన్నందున కేవలం తాగునీటి సరఫరా కోసం మాత్రమే ప్రాజెక్టు పనులని కొనసాగిస్తున్నామని ప్రభుత్వం వాదించింది. అయినా ప్రభుత్వ వాదనతో ఏకీభవించని ఎన్జీటి ప్రాజెక్ట్ పనులపై స్టే విధించింది. అయితే కోర్టు తీర్పు పూర్తి పాఠం వచ్చిన తర్వాత సుప్రీంలో అప్పీలు చేస్తామని కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ హరిరాం తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్ 7కు ప్రత్యేకత ఉంది. అంకెల వరుసక్రమంలో చూస్తే ఈ తేదీ 7-1౦-2౦17 గీతలు లేకుండా కలిపి రాస్తే చూస్తే ఇది 71౦2౦17 అవుతుంది. ఇందులోనే తిరకాసు ఉంది. కుడినుంచి చూసినా, ఎడమ నుంచి చూసినా ఒకే విధమైన అంకెల రంకెలు వేస్తుంటాయి. కాలగమనంలో ఈ విశేషసంఖ్యా దినం అతి తక్కువగా వస్తుందని వెల్లడైంది.
టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని పేర్కొంటూ అదే పార్టీకి చెందిన ఓ కార్యకర్త సెల్ టవర్ ఎక్కాడు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ అనే కార్యకర్త మరికల్ గ్రామంలో సెల్ టవర్ ఎక్కాడు. తెలంగాణ ఉద్యమంలో తాను ఎంతో కృషి చేశానని, దాన్ని గుర్తించిన కేసిఆర్ తనకు కొన్ని కాంట్రాక్ట్ పనులు అప్పగించాడని శ్రీనివాస్ తెలిపాడు. అయితే ఈ పనులను, రావాల్సిన బిల్లులను స్థానిక ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి వేధింపులు తట్టకోలేకే సెల్ టవర్ ఎక్కానని శ్రీనివాస్ తెలిపాడు
దీంతో స్థానికులు, అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారమందుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది సెల్‌టవర్ దగ్గరకు చేరుకుని అతన్ని కిందకు దించడానికి ప్రయత్నిస్తున్నారు.
కృష్ణా జిల్లా : సీనియర్ విద్యార్థి ప్రేమ పేరుతో చేస్తున్న వేధింపులు తట్టుకోలేక తిరువూరులో ఉ కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తిరువూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న కంచు వెంకట కుమారి కాలేజీలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు, అద్యాపకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ విద్యార్థి మృతిచెందింది.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమికంగా విచారణ చేపట్టారు. ఈ ఆత్మహత్యకు ప్రేమ వేదింపులే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఈత కని వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెరువులో మునిగి మృత్యువాత పడ్డ దుర్ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కొత్తగూడ మండలం లోని సాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాజు, సాయికుమార్ అనే చిన్నారులు గ్రామ సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లారు. అయితే ఈత సరిగా రాని ఇద్దరు బాగా తోతులోకి వెళ్లడంతో నీటిలో మునిగి చనిపోయారు. విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు చెరువు వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
హైదరాబాద్ : సొంత బావ చేతిలో సౌమ్య అనే బిఎస్సి విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యింది. తాను ప్రేమించిన సౌమ్య మరెవరితోనో చనువుగా ఉంటుందన్న అనుమానం పెంచుకున్నాడు కృష్ణయ్య. ఈ విషయంపై మాట్లాడటానికని కాలేజి నుంచి సౌమ్యను తీసుకెళ్లి అతి దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం శవాన్ని కారులో తీసుకెళ్లి కూకట్ పల్లి ఐడీయల్ చెరువులో పడేసాడు.
తర్వాత అతడే స్వయంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని మృత దేహం పడేసిన ఐడియల్ చెరువు దగ్గరకు తీసుకుళ్లిన పోలీసులు మృతదేహం కోసం గాలిస్తున్నారు.