సబ్సీడీ గ్యాస్ ధర పెంపు

Published : Jul 31, 2017, 05:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
సబ్సీడీ గ్యాస్ ధర పెంపు

సారాంశం

ప్రతి నెలా రూ.4 పెంపు ప్రకటించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్

సబ్సీడీ గ్యాస్‌ ధర మళ్లీ పెరిగింది.సిలిండర్‌పై ప్రతి నెలా రూ.4 పెంచనున్నట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ సోమవారం తెలిపారు. ఈ మేరకు  ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి సబ్సీడీలను పూర్తిగా తొలగించే క్రమంలోనే కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

వచ్చే ఏడాది మార్చి వరకు లేదా సబ్సీడీ పూర్తిగా తొలగిపోయేంతవరకు ఈ ధరల పెంపు కొనసాగుతోందని ప్రదాన్ చెప్పారు. ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం కంపెనీలు గతేడాది జులై 1 నుంచి సబ్సీడీ సిలిండర్‌పై ప్రతి నెలా రూ.2 (వ్యాట్‌ కాకుండా) పెంచుతూ వస్తున్న సంగతి తెలిందే. .కాగా ఇప్పటి నుంచి నెలనెలా రూ. 4 పెంచాలని కంపెనీలను ఆదేశించినట్లు ప్రదాన్‌ వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)