మంత్రి జూపల్లికి రేవంత్ సోదరుడు ఝలక్

First Published Nov 27, 2017, 12:35 PM IST
Highlights
  • కొడంగల్ పర్యటనలో మంత్రి జూపల్లికి షాక్
  • జూపల్లి పర్యటనలో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నిరసన
  •  మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ కార్యకర్తలు 
  • ప్రొటోకాల్ వివాదాన్ని తెరపైకి తెచ్చిన తిరుపతి రెడ్డి

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి షాక్ ఇచ్చారు. సోమవారం కొడంగల్ పర్యటనలో ఉన్న జూపల్లిని కోస్గి మండలంలోని నాగసానిపల్లిలో బిటి రోడ్డు శంకుస్థాపన విషయంలో  వివాదం నెలకొంది. బిటి రోడ్డు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి పర్యటన విషయంలో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీలతా నరేందర్ లు నిరసన తెలిపారు. కనీసం గ్రామ సర్పంచ్ కు కూడా సమాచారం, ఆహ్వానం లేకుండా రోడ్డుకు శంకుస్థాపన ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిరెడ్డి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా జమ అయ్యారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటే క్రమంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను శాంతిపజేయడంతో వివాదం సద్దుమణిగింది.  ఈ నిరసన కార్యక్రమంలో భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ముదిరెడ్డిపల్లిలో మరో రకమైన షాక్ 

ఇదిలా ఉంటే ఇదే పర్యటనలో గ్రామంలో మంత్రికి మరో షాక్ తగిలింది. ముదిరెడ్డిపల్లి లో మంత్రి ప్రారంభించాల్సిన అభివృద్ది పనులను అతడు రాకుండానే గ్రామస్థులే కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. అనంతరం అక్కడకు చేరుకున్న మంత్రి మళ్లీ అవే పనులకు మరోసారి ప్రారంభించారు. 

 ఈ సంఘటనకు సంభందించిన వీడియోల కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=We1esSv6nOk&feature=youtu.be

click me!