ప్రతి పథకం కోర్టులో ఆగిపోవాలని కేసీఆర్ కోరిక

First Published Nov 26, 2017, 6:06 PM IST
Highlights
  • సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన బిజెపి నిరుద్యోగ సమరభేరి
  • ముఖ్య అతిథిగా హాజరైన పూనమ్ మహజన్
  • కేసీఆర్ సర్కారుపై విరుకుపడ్డ నాయకులు
  • నిరుద్యోగులకు బిజెపి అండగా ఉంటుందని హామీ 

బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో జరుగుతున్న ''నిరుద్యోగ సమర భేరి'' సభలో తెలంగాణ సర్కార్ పై బిజెపి నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం కోర్టుల్లో ఆగిపోవాలని కేసీఆర్ కోరుకుంటున్నారని, ఆయన కోరుకున్నట్లే పథకాలన్ని కోర్టుల్లోనే మగ్గుతున్నాయని అన్నారు కిషన్ రెడ్డి. యువతను విస్మరిస్తున్న కేసీఆర్ కు కూడా నిజాం కు పట్టిన గతే పడుతుందన్నారు. నిరుద్యోగుల  బలిదానాలపై  కేసీఆర్ అధికారాన్ని అనుభవిస్తున్నారు.అలాంటి నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకుంటే , వచ్చే ఎన్నికల్లో  కేసీఆర్ రాజకీయ నిరుద్యోగి కాక తప్పదంటూ ఘాటుగా విమర్శించారు. టీఆర్ఎస్, కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే అని కిషన్ రెడ్డి అన్నారు.

అనంతరం బిజెపి రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ... ఉద్యమంలో తెగించి కొట్లాడిన యువత  స్వరాష్ట్రంలో దగాకు గురవుతున్నారని అన్నారు. ఎన్నికల మేనిపెస్టోలో ఇంటికో  ఉద్యోగం ఇస్తామన్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఊరికో  ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. డిఎస్సి వేయకపోతే కొంపమునుగుతుందా అంటూ కేసీఆర్ నిరుద్యోగులను అవమానించడం సిగ్గుచేటని అన్నారు.  ప్రతి విషయం లో ఏపీతో పోల్చుకునే కేసీఆర్ నోటిఫికేషన్ ల విషయంలో మాత్రం ఎందుకు పోల్చుకోదంటూ ప్రశ్నించారు. ఎందుకంటే ఎపి ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో మన కంటే మెరుగ్గా ఉన్నందున ఈ విషయంలె పోల్చుకోదంటూ వివరించారు. రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని అంటున్న ప్రభుత్వం, ఆ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. యువత జీవితాలతో ప్రభుత్వం ,టిఎస్పిఎస్సి కలిసి ఆటలాడుకుంటున్నాయని అన్నారు. సర్కారు గతంలో ప్రకటించినట్లు లక్షా  12వేల  ఉద్యోగాల నియామకం జరిగే వరకు  బిజెపి మడమతిప్పకుండా నిరుద్యోగుల తరపున పోరాడుతుందని ప్రకటించారు.

ఇక ఇదే సభలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి నాయకులు మురళీధర్ రావు మాట్లాడుతూ.. ఇది నిరుద్యోగ సమరభేరి కాదని తెలంగాణ యుద్ధ సభ అని అన్నారు. బిజెపి ఎవడి జేబుల్లో ఉండే పార్టీ కాదు, కాంట్రాక్ట్ లకు అమ్ముడు పోయే పార్టీ అంతకన్నా కాదని ప్రభుత్వనికి సూచిచారు.ఈ సభను భగ్నం చేసేందుకు ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడిందని అయినా ఈ సభను జరిపి తమ బలమేమిటో నిరూపించుకున్నామని అన్నారు. మూడున్నర ఏళ్లలో ఖాళీలను భర్తీ చేయని ప్రభుత్వం ఈ ఏడాదిలో చేస్తుందన్న ఆశలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణా లో బిజెపి గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ,టీఆరెస్ లు దొందు దొందే అని విమర్శించారు. 

ఇక ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షురాలు
 పూనమ్ మహాజన్ తెలంగాణ యువకుల స్వప్నాలను కేసీఆర్ నీరుగార్చారన్నారు. కేసీఆర్ తన కుటుంబంలో అందరికి  ఉద్యోగాలు ఇచ్చుకుని, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలివ్వకుండా క్షోభకు గురిచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ దిన్ మే కాంగ్రెస్ తో  రాత్రి ఎంఐఎం తో దోస్తీ  చేస్తున్నారు.  కాంగ్రెస్ తో ఫ్రెండ్లీ, ఎంఐఎం లతో రొమాన్స్ మ్యాచ్ ఆడుతున్న కేసీఆర్ ను ఇక తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.  తాను తెలంగాణకు బిడ్డనని,ఆంధ్రకు కోడలునని ఈ తెలంగాణ ఖుష్భు మహాజన్ రక్తంలో ఉందని అన్నారు. 

మొత్తానిక భారీగా చేరుకున్న బిజెపి నాయకులు, కార్యకర్తల మద్య నిరుద్యోగుల సమరభేరి విజయవంతంగా జరిగుతోంది. 
 

click me!