ఊరించే పథకాలు ప్రకటించిన జగన్

Published : Jul 09, 2017, 06:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఊరించే పథకాలు ప్రకటించిన జగన్

సారాంశం

వైసిపి అధినేత జగన్ ఇప్పటి వరకు ఎవరూ  సాహసం చేయని పథకాలు ప్రకటించారు. జనాలను ఊరించే పథకాలు ప్రకటించారు. అమరావతిలో జరిగిన ప్లీనరీ వేదికగా 9 పథకాలను ఆయన ప్రకటించారు. వాటిని అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నరు. ప్లీనరీ సభలోనే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు జగన్. మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండేందుకు ఈ 9 పథకాలు ప్రకటించారని తెలుస్తోంది. 

వైసిపి అధినేత జగన్ ఇప్పటి వరకు ఎవరూ  సాహసం చేయని పథకాలు ప్రకటించారు. జనాలను ఊరించే పథకాలు ప్రకటించారు. అమరావతిలో జరిగిన ప్లీనరీ వేదికగా 9 పథకాలను ఆయన ప్రకటించారు. వాటిని అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నరు. ప్లీనరీ సభలోనే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు జగన్.

 

జగన్ ప్రకటించిన ఫథకాల్లో అత్యంత కీలకమైనది రైతు సంక్షేమం గురించి. ఆయన ప్రకటించిన మొదటి కార్యక్రమం వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం. దీని ద్వారా రైతులకు 50వేలు అందజేస్తామని, ఏటా మే నెలలోనే 12500 రైతు ఎకౌంట్ లో జమ చేస్తామన్నారు. అలాగే 3వేల కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్సన్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనిద్వారా 86శాతం మంది రైతులకు అంటే 66 లక్సల మందికి మేలు జరుగుతుందన్నారు. ఇక ప్రస్తుతం ఉన్న పెన్షన్లను వెయ్యి రూపాయల నుంచి 2వేలకు పెంచుతామన్నారు.

 

అమ్మ ఒడి ద్వారా 1నుంచి 5 వరకు చదివే పిల్లలకు ప్రతినెలా 500 రూపాయలు ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఇస్తామన్నారు. ఆరు. 6నుంచి 10వ తరగతి వరకు 750 రూపాయల చొప్పున ఇద్దరు పిల్లలకు జమ. ఇంటర్ విద్యార్థులకు ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే వారికి వెయ్యి జమ చేస్తామన్నారు. ఆ పిల్లల తల్లి ఖాతాలో జమ చేస్తామన్నారు. మద్య నిషేధం విషయంలోనూ చాలా కీలకమైన ప్రకటన చేశారు జగన్. షాక్ కొట్టేలా మద్యం రేట్లు పెంచుతామన్నారు. కోటీశ్వరులకు మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.

 

ఇవీ జగన్ అధికారం చేపట్టగానే అమలు చేసే 9 కార్యక్రమాలు

 

1. వైఎస్సాఆర్ రైతు భరోసా కార్యక్రమం.. రూ.50వేలు ఇస్తాం.

2. డ్వాక్రా మహిళలకు వైఎస్సాఱర్ ఆసరా.. ప్రస్తుత రుణాన్ని మాఫీచేస్తాం.

3. పెన్షన్లు.. రెండువేలు ఇస్తాం.

4. అమ్మ ఒడి... చదువుకునే పిల్లల తల్లులకు డబ్బులిస్తాం.

5. హౌసింగ్ కార్యక్రమం.. ప్రతి పేదవాడికి ఇళ్ళు ఇస్తాం.

6.  ఆరోగ్యశ్రీ.. అందరూ ఆరోగ్యం అందరికీ అందేలా చూస్తాం.

7.ప్రత్యేక హోదా తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం.

8. జలయజ్ఞం..రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తాం

9. దశల వారీగా మద్యపాన నిషేధం. భారీగా మద్యం ధరల పెంపు. మద్యం అందుబాటులో లేకుండా చేయడం

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)