భువీ-ధోనీ క్లాసిక్ ఇన్నింగ్స్ తో భార‌త్ విజ‌యం

Published : Aug 25, 2017, 12:28 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
భువీ-ధోనీ క్లాసిక్ ఇన్నింగ్స్ తో భార‌త్ విజ‌యం

సారాంశం

అద్బుతమైనా బ్యాటింగ్ తో ఆకట్టుకున్న భువనేశ్వర్. సమయానుకులంగా ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ. ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ గెలిపించిన ధోనీ - భువీ.

శీలంకతో జ‌రుగుతున్న రెండ‌వ వ‌న్డేలో పై భార‌త్ గెలిచింది అంటే చాలా మంది న‌మ్మ‌రు. ఎందుకుంటే పీక‌ల్లోతు కష్టాల్లో ఇండియా టాప్‌ ఫినిష‌ర్ ధోనీ ఉన్నా కూడా భార‌త్ గెలుపు డౌటే అనుకున్నారు, కానీ ఇండియా గెలిచింది, కార‌ణం ఇండియ‌న్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కూమార్, త‌రువాత మహేంద్ర సింగ్ ధోని.

 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌ శర్మ(54), శిఖర్‌ధావన్‌(49)లు మంచి శుభారంబాన్ని అందించారు. తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించిన ఈ జంటను లంక స్పిన్నర్‌ అఖిల ధనంజయ రోహిత్‌ను అవుట్‌ చేసి విడగొట్టాడు. ఇక అక్క‌డితో మొద‌లైంది భార‌త వికెట్ల ప‌త‌నం, ఓపెన‌ర్‌ శిఖర్‌ ధావన్‌ సిరివర్ధన బౌలింగ్‌లో క్యాచ్‌ అవుటై అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం మరింత శ్రీలంక బౌల‌ర్ ధనుంజయ చెలరేగాడు, వరుస ఓవర్లో జాదవ్‌(1), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(4), కేఎల్‌ రాహుల్(4), హార్ధిక్‌ పాండ్యా(0), అక్షర్‌ పటేల్‌(6) లను అవుట్‌ చేసి మొత్తం 6 వికెట్లతో భారత టాప్‌ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. భారత్‌ కేవలం 22 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీక‌ల లోతు కష్టాల్లో పడింది.

బౌల‌రే కదా లైట్‌

131 ప‌రుగుకు ఇండియా 7 వికెట్లు కోల్పోయింది. క్రీజులో ధోనీ ఉన్నాడు, త‌ను నిలిచిన బౌల‌ర్లు నిల‌వాలి క‌దా.. మిగిలింది భువ‌నేశ్వ‌ర్ కూమార్‌, యుజెంద్రచౌహాల్‌, జ‌ప్రిత్ బూమ్రా..  శ్రీలంక‌ విజ‌యం దాదాపుగా ఖ‌రారైంది. అప్పుడే భువీ బ్యాటింగ్ కి క్రీజులోకి వ‌చ్చాడు, మొద‌ట ధోని కి స‌హక‌రిస్తు ఆచితూచి ఆడాడు, ధోని కూడా సింగిల్స్ కె ప‌రిమితమ‌య్యాడు, బౌండ‌రీలు బాదే అవ‌కాశం వ‌చ్చిన సింగిల్స్ రాబ‌ట్టాడు. ఇండియా స్కోర్‌బోర్డ్ పై నెమ్మ‌దిగా పెరుగుతుంది, ఇక అప్పుడే భువీ త‌న‌లోనే బ్యాట్స్‌మేన్ ని బ‌య‌టికి తీశాడు, ఒక వైపు ధోనీకి స‌హాక‌రిస్తునే అద్బుత‌మైన స్ట్కోక్ తో బౌండ‌రీలు బాదాడు, భువీ వేగంగా ఆడుతూ 77 బంతుల్లో (51; 4 ఫోర్లు, ఒక సిక్స్‌) కెరీర్‌లో తొలి అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. భువ‌నేశ్వ‌ర్ 80 బంతుల్లో 53 ప‌రుగులు చేశాడు. మ‌హేంద్ర సింగ్ ధోనీ మొద‌టి నుండి చాలా జాగ్ర‌త్త‌గా ఆడుతూ వ‌చ్చాడు, 68 బంతుల్లో 45 ప‌రుగులు చేశాడు.

చివ‌ర్లో ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో  ధోనీ-భువనేశ్వర్‌ల క్లాసిక్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ గట్టెక్కింది. దాదాపు ఓటమి అంచుకు చేరిన భారత్‌ చివరికి  3 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ఇండియా 2-0తో సిరీస్ లో ముందు ఉంది.  

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. వర్షం చాలాసేపు ఆటకు అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్‌ను 47 ఓవర్లలో 231 పరుగులకు కుదించారు. అంతకు ముందు బుమ్రా 4 వికెట్లు, చాహల్ రెండు వికెట్లు తీశారు. 

 

మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వ‌ర్మా నీకు త‌గిన బుద్ది చెబ్తా రా...!

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)