పాము గుడ్లకు కాపలా కాసారు..!

Published : Aug 03, 2017, 02:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
పాము గుడ్లకు కాపలా కాసారు..!

సారాంశం

కింగ్ కోబ్రా గుడ్లు కనిపించాయి గతంలో పాము గుడ్లను గ్రామస్థులు తగలపెట్టారు.

 

అల్లంత దూరంలో ఓ చిన్న పాము కనిపిస్తేనే.. గజగజ వణికిపోతాం. అలాంటిది పెద్ద పాము.. అందులోనూ కింగ్ కోబ్రా కనిపిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి. మామూలు వాళ్లు అయితే..కనీసం ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడరు. వెంటనే పరుగులు తీస్తారు. కానీ.. ఓ ముగ్గురు వ్యక్తులు మాత్రం అలా చెయ్యలేదు..సరికదా.. ఆ పాము పెట్టిన గుడ్లకు కాపలా కాసారు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

 

కొట్టియూర్‌ ప్రాంతంలో చంద్రన్ అనే వ్యక్తి అటవీశాఖ అధికారిగా పనిచేస్తున్నాడు. అతనికి గత ఏప్రిల్ 22న ఓ వ్యక్తి కింగ్ కోబ్రాను చూశానంటూ ఫోన్ చేశారు.దీంతో ఆ అధికారి.. వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌, అటవీగార్డ్‌తో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయితే వారికి కింగ్‌కోబ్రా కనిపించలేదు కానీ.. అది పెట్టిన గుడ్లు పెద్దసంఖ్యలో కనిపించాయి.

 భయంతో ఆ విషసర్పం గుడ్లను వదిలేసి వెళ్లినట్లు గుర్తించారు. గతంలోనూ ఒకసారి పాము ఇలాగే గుడ్లు పెడితే వాటిని గ్రామస్తులు తగలపెట్టారు. దీంతో ఈసారి ఆ గుడ్లను రక్షించాలని ఆ ముగ్గురు నిర్ణయానికి వచ్చారు. వాటిని పొదిగే వరకూ కాపాడలనుకున్నారు. అప్పటి నుంచి ఆ ముగ్గురు వంతులవారీగా వాటికి రక్షణగా ఉంటున్నారు. ఈ విషయం గురించి గ్రామస్థులకు చెప్పి వారిని ఒప్పించారు. పాము పిల్లలు బయటకి రాగానే వాటిని అటవీప్రాంతంలో దూరంగా వదిలిపెడతామని వారికి చెప్పారు.

ఈ ప్రాంతం 90 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ రోజుకొకసారి వచ్చి గుడ్లను కాపాడుతూ వచ్చారు. 72 రోజుల అనంతరం గుడ్ల నుంచి పాము పిల్లలు రావడం గమనించారు. అనంతరం వాటిని సమీప అటవీప్రాంతంలోకి వదిలేశారు.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)