ఆ ఇంటి ధర చాలా చీప్

First Published Aug 3, 2017, 2:06 PM IST
Highlights
  • అమెరికాలో 10 డాలర్లకే ఇంటిని అమ్మకానికి పెట్టిన ప్రభుత్వం

 
ఇల్లు కట్టాలన్నా, కొనాలన్నా లక్షల్లో ఖర్చుచేయాల్సిందే. ఇక సెలబ్రటీలు నివసించిన ఇళ్లయితే దాని విలువ వెలకట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. కానీ అమెరికా న్యూజెర్సీ నగరంలోని ఓ పురాతన విలాసవంతమైన భవనాన్ని అత్యంత చవక ధరకు అమ్మకానికి పెట్టారు. ధర కేవలం పది డాలర్లే, అంటే మన కరెన్సీలో 637 రూపాయలు మాత్రమే. కానీ దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి.
న్యూజెర్సీ మౌంట్‌క్లెయిర్‌లోని  స్థానిక హౌసింగ్‌ సోసైటీ లేఅవుట్‌ వేసి అభివృద్ధి చేయాలని ఫ్రభుత్వం భావించింది. అయితే.. అక్కడే 1906లో ప్రముఖ ఆర్కిటెక్చర్‌ డుడ్లే  వ్యాన్‌ అంట్రెప్‌ నిర్మించిన ఇల్లు ఉంది. అందులో  తొలి అమెరికన్‌-ఆఫ్రికన్‌ పుట్ బాల్ ప్లేయర్ అబ్రే లూయిస్‌ నివసించేవాడు. ఇలా వందేళ్ల చరిత్రగల ఆరు పడక గదులు గల  ఈ ఇంటిని ధ్వంసం చేయకుండా అమ్మకానికి పెట్టింది  స్థానిక ప్రభుత్వం. కానీ ఇంటి ధరను కేవలం 10 డాలర్లుగా  నిర్ణయించింది. 
 10 డాలర్లకు ఇంటిని కొనుగోలు చేసిన యాజమాని, ఆ ఇంటిని అమాంతం అక్కడి నుంచి మరో చోటుకి తరలించాల్సి ఉంటుంది. అందుకయ్యే ఖర్చు కొనుగోలుదారే భరించాలి. పురాతన చారిత్రక భవనాన్ని అధునీకత పేరుతో కూల్చడం సరికాదని భావించిన అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.అయితే కొనుకున్న యజమాని కూడా ఇంటిని ధ్వంసం చేయరాదనే షరతును పెట్టింది అక్కడి ప్రభుత్వం.

click me!