భారీగా అక్ర‌మ ఎర్ర‌చందనాన్ని ప‌ట్టుకున్న క‌స్ట‌మ్స్ అధికారులు

Published : Aug 26, 2017, 06:30 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
భారీగా అక్ర‌మ ఎర్ర‌చందనాన్ని ప‌ట్టుకున్న క‌స్ట‌మ్స్ అధికారులు

సారాంశం

చెన్నై నుండి మలేషియా సరఫరా చేస్తున్న ఎర్రచంధనం రెండు రోజుల్లో 16 కోట్ల విలువైనా ఎర్రచంధనం పట్టివేత.

చెన్నై స‌ముద్ర‌పు పోర్టులో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న‌ ఎర్ర‌చంద‌నం ప‌ట్టుకున్నారు క‌స్ట‌మ్స్ అధికారులు, ఒక‌టి కాదు, రెండు కాదు అక్ష‌రాల రూ.16 కోట్ల విలువైనా ఎర్ర‌చంద‌నం దుంగ‌ల‌ను ప‌ట్టుకున్నారు. కేవ‌లం రెండు రోజుల్లో నాలుగు ర‌కాలుగా వివిధ కంటైన‌ర్ల ద్వారా మ‌లేషియా త‌ర‌లిస్తున్న వాటిని అడ్డుకున్నారు. 

కేంద్ర రెవిన్యూ శాఖా తాజాగా శనివారం(26.08.2017) విడుద‌ల చేసిన‌ ఓ ప్ర‌క‌ట‌న‌లో ఎర్ర‌చంద‌నం ముఠా గురించి వివ‌రాలు అందించింది.  బుధ‌వారం, గురువారం చెన్నై స‌ముద్ర తీరం సరుకు స్టేషన్ల వ‌ద్ద‌ అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఎర్రచంద‌నాన్ని ప‌ట్టుకున్నామ‌ని తెలిపింది. చైన్నై నుండి మ‌లేషియా కు 8 కంటెన‌ర్ల‌ను కొంద‌రు స‌ర‌ఫ‌రా చెస్తున్నార‌ని తెలిపింది. ప‌ట్టుబ‌డ్డ ఎర్ర‌చంద‌నం 40 మెట్రిక్ ట‌న్నులు ఉంటుంద‌ని, వాటి విలువ సూమారు 16కోట్లు పై చిలుకు ఉంటున్న‌ట్లు తెలిపింది. నెల రోజుల పాటు ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల పై నిఘా పెట్టి మ‌రీ అడ్డుకున్న‌ట్లు తెలిపింది. వీటిని సీజ్ చేసిన‌ అధికారులు సెక్ష‌న్ 3(3) విదేశి మార‌క‌ద్రవ్యం ప్ర‌కారం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.


ఈ కంటెన‌ర్లు అన్ని క‌స్ట‌మ్స్ అధికారుల వ‌ద్ద బ‌ట్ట‌లు, ఇళ్ల‌ డోర్ మ్యాట్లు, ఇత‌ర వ‌స్తువులు ర‌వాణా చేస్తున్న‌ట్లు రిజిస్ట‌ర్ చెయ్య బ‌డింది. ఈ ఎర్ర‌చంద‌నం అంతా క‌ర్నూల్‌, అనంతపూర్, ప్ర‌కాశం నెల్లూర్ జిల్లాల నుండి చెన్నై కి త‌ర‌లిస్తున్న‌ట్లు, అక్క‌డి నుండి మ‌లేషియాకు ర‌వాణా చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.


గ‌త మూడు సంవ‌త్స‌రాల నుండి  176 మేట్రిక్ ట‌న్నుల ఎర్ర‌చంద‌నం ప‌ట్టివేసిన‌ట్లు  వాటి విలువ 71 కోట్లు ఉన్న‌ట్లు తెలిపారు. 

 

మరిన్ని వార్తావిశేషాల కోసం కింద క్లిక్ చేయండి 

తెలంగాణాలో దుమ్మురేపుతున్న ఆంధ్రా అమ్మాయి

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)