2017 లో హైదరాబాద్ రచ్చ రచ్చ

First Published Dec 29, 2017, 1:56 PM IST
Highlights
  • 2017 లో హైదరాబాద్ లో రచ్చ చేసిన నాలుగు సంఘటనలు

 హైదరాబాద్ నగరంలో 2017 లో తీవ్ర చర్చకు ముఖ్యంగా వివాదానికి కారణమైన అనేక సంఘటనలు జరిగాయి. అలా వార్తల్లో నిలిచిన టాప్ స్టోరీస్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింది స్టోరీ చదవాల్సిందే.

1. మియాపూర్ భూకుంభకోణం. 2017 లో రాష్ట్ర రాజ‌కీయాల‌ను షేక్ చేసిన స్కాం. వేల కోట్ల విలువైన భూముల‌ను కొందరు రాజకీయ  నాయకుల, ముఖ్యంగా ప్రస్తుత అధికార పార్టీ నాయకుల పేర్లు బయటకు రావడంతో తీవ్ర కలకలం రేగింది. దీంతో స్టేట్ పాలిటిక్స్‌ ఒక్కసారి హీటెక్కిన విషయం తెలిసిందే. ఈ స్కాంతో సంభందాలున్నట్లు ఒకప్పటి కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌లు, ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీలు కేకే, డీఎస్‌ల పేర్లు బలంగా వినబడ్డాయి. వీరు ఈ కుంభకోణంలో ముఖ్యమైన నిందితుడిగా ఉన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్‌  సాయంతో ఈ భూములను పొందారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలా మొత్తం 10వేల కోట్ల రూపాయ‌ల ప్రజాధనాన్ని రాజకీయ పలుకుబడితో అప్పనంగా కాజేశారని ఆరోపణలున్నాయి. ఈ భూ స్కాం 2017 లో అటు ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఇటు అధికారపక్ష టీఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టింది.   

2. ఇక హైదరాబాద్ ఈ సంవత్సరం కుదిపేసిన మకో సమస్య భారీ వర్షాలు. ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో నగర వాసులు నానా అవస్థలు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరం రూపు రేఖలు మారిపోయాయి. రోడ్లన్నీ చెరవుల్లా మారి వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.  ఈ వర్షాలకు  పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి.  దీంతో నగరవాసులు ఇండ్లలోంచి బయటకు రావడానికి భయపడేంత ఘోరంగా నగరంలో నెలకొన్న పరిస్థితులు పరిస్థితులను చూశాం. అలాగే విద్యుత్ స్తంబాలు, చెట్లు విరిగిపడటం, విద్యుత్ వైర్లు తెగిపడటం ఇలా అనేక ప్రమాదాలకు లు సంభవించాయి. అలాగే విద్యుత్ లేక అనేక కాలనీలు అంధకారంలో గడిపారు.  ఈ భారీ వర్షాల నీట మునిగిన ప్రాంతాల ప్రజలను కాపాడటం, వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం జీహెచ్ఎంసీ అధికారులు, ప్రభుత్వం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇలా భారీ వర్షాలతో 2017 లో నగరం అతలాకుతమయ్యింది.

3. ఇక ఈ వర్షాలతో పాటు మెట్రో పనుల కారణంగా నగరంలోని రోడ్లు అద్వాన్నంగా మారి 2017 లో నగరవాసులను ముప్పుతిప్పలు పెట్టాయి. ఈ రోడ్లపై ప్రయాణించాలంటేనే నగర వాసులు జంకిన పరిస్థితి కన్పించింది. ఓ వైపు వర్షాలు, మరో వైపు మెట్రోపనులు, వివిధ అవసరాల కోసం రోడ్లను తవ్వడం కారణం ఏదైతేనేం హైదరాబాద్ లో రోడ్లు గుంతలతో అధ్వానంగా మారాయి. దీంతో  సిటీలో ప్రయాణమంటేనే నరకం అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఎప్పుడూ లేని విధంగా ఈ 2017 సంవత్సరంలో నగర రోడ్లపై తీవ్ర చర్చ జరిగింది.   

కాంట్రాక్టర్ల అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం, నాయకుల పర్యవేక్షణ లేమి వల్లే రోడ్లు ఇలా అద్వాన స్థితికి చేరుకున్నాయని ప్రజలు మండిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సీటీలో రోడ్ల రిపేరు కోసం ఏటా 100 నుంచి 120 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తేన్నామనడమే తప్ప  అలాంటి పరిస్థితులు హైదరాబాద్ లో కనబడటం లేదన్నది నగరవాసుల ప్రశ్న.  అప్పటికప్పుడు గుంతలను పూడ్చడం, ప్యాచ్‌ వర్క్‌లు మాత్రమే చేసి రోడ్డన్ని బేషుగ్గా ఉన్నాయని జీహెచ్ఎంసీ తనకు తానే కితాబిచ్చుకుంటుందని నగరవాసులు విమర్శించారు.   ఇలా రోడ్ల విశయంలో ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ అభాసుపాలయ్యింది.

4. ఇక 2017 సంవత్సరంలో ఇవాంక ట్రంప్ హైదరాబాద్ పర్యటన మరో రచ్చకు దారితీసింది. ఆమె పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వందల కోట్లు ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే.  అయితే ఈ ఖర్చు కేవలం ఇవాంక పర్యటించిన ప్రాంతాలకే పరిమితమవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది.  ఆమె పర్యటించే ప్రాంతాలను మాత్రమే అందంగా ముస్తాబుచేయడంపై నగర వాసులు అసహనం వ్యక్తం చేశారు. ఈ అసహనాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రదర్శిస్తూ.. ఇవాంక తమ ప్రాంతాలకు కూడా రావాలని, అమే వస్తే తమ ప్రాంతాన్ని కూడా ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దుతుందంటూ పోస్ట్ లు కూడా పెట్టారు. ఇలా ఇవాంక పర్యటన కూడా నగరంలో రచ్చకు కారణమైంది.

 

click me!