సైకిల్ కి తాళం వెయ్యనందకు 20 కోట్లు ఫైన్ వేశారు

Published : Aug 01, 2017, 06:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
సైకిల్ కి తాళం వెయ్యనందకు 20 కోట్లు ఫైన్ వేశారు

సారాంశం

తాళం వెయ్యనందుకు 20 కోట్ల ఫైన్ విధించిన మోబైక్ సంస్థ కంగారు పడ్డ చైనీయుడు తీరా సమాచారం తెలుసుకొని ఉపిరి పీల్చుకున్నాడు.

చైనా లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది, చైనీయుడు త‌ను అద్దెకు తీసుకున్న సైకిల్ కి లాక్ వెయ్య‌నందుకు 20 కోట్లు ఫైన్ వేశారు.

బీజింగ్ లో సైకిల్ షేరింగ్ మోబైక్ సంస్థ లో లీ అనే వ్య‌క్తి ఒక సైకిల్ ని రెంట్ కి తీసుకున్నాడు. త‌న ఆఫీస్ నుండి రైల్వే స్టేష‌న్ కి ప్ర‌యాణించ‌డానికి సైకిల్ ను ఎంచుకున్నాడు. రోజుకి ఒక్క యూవాన్ ( దాదాపుగా ఇండియాలో 10 రూపాయ‌లు) తో అద్దెకు తీసుకున్నాడు. అక్క‌డి నుండి స్టెష‌న్ కి చెరుకున్నాడు, సైకిల్ స్టాండ్ లో మ‌రిచిపోయి త‌న అద్దెకి తీసుకున్న సైకిల్ కి లాక్ చెయ్య‌డం మ‌రిచిపోయ్యాడు. త‌క్ష‌ణ‌మే మోబైక్ క‌స్ట‌మ‌ర్ కేర్ కి కాల్ చేసి చెప్పాడు. అప్పుడు 15 యూవాన్‌లు ఎక్కువ‌గా చెల్లించాలి అని చెప్పాడు. ప‌ర్వాలేదు అనుకున్నాడు లీ.


కానీ మూడు రోజుల త‌రువాత 15 యూవాన్ల‌ను చెల్లించ‌డానికి లీ మోబైక్ ఆఫీస్‌కి వెళ్లాడు. కానీ అక్క‌డ త‌న చేతికి ఇచ్చిన ఫైన్ బిల్లును చూసి త‌ల‌ తిరిగింది. కార‌ణం అందులో 3.1 మిలియ‌న్ ఫైన్ ఉంది. అదేంటి అని అక్క‌డ ఉన్న బిల్ బాయ్ ని అడిగితే అదే సార్ మీ బిల్లు.. కట్టండి అని తాపిగా చెప్పాడు. అర్థం కానీ లీ, మోబైక్ అధికారుల‌ను క‌లిసి వివ‌రించాడు.. వాళ్లు టెక్నిక‌ల్ గా స‌మ‌స్య వ‌చ్చి ఉంటుంద‌ని చెప్పారు. త‌క్ష‌ణ‌మే లీకి క్ష‌మాప‌ణ చెప్పి 15 యూవాన్ల బిల్లును క‌ట్టించుకొని పంపిచేశారు. బిల్లును చూసి ఒక్క క్ష‌ణం గుండె ఆగిపోయిన లీ ఉపిరి పిల్చుకున్నాడు. ఈ విష‌యం చైనా లోక‌ల్ మీడియాలో బాగా హాల్చ‌ల్ చేస్తుంది.
 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)