బాలీవుడ్ మెగాస్టార్ దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమం

Published : Aug 03, 2017, 07:14 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
బాలీవుడ్ మెగాస్టార్ దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమం

సారాంశం

కిడ్నీ సమస్యలతో భాదపడుతున్న దిలీప్ కుమార్ ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు

 
బాలీవుడ్ మెగాస్టార్ దిలీఫ్ కుమార్ ఆరోగ్య  పరిస్థితి విషమంగా  ఉంది. ప్రస్తుతం రక్త పోటు పెరిగి ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో వైద్యులు ఆయన్ని ఐసీయూకు తరలించించారు.  ఆయనకు వయసు పైబడటంతో పరిస్థితి అదుపుతోకి రావడం లేదని వైద్యులు తెలుపుతున్నారు. 94 సంవత్పరాల వయసులో కిడ్నీల సమస్య రావడం, అది ఇపుడు తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితి చేయిదాటినట్లు వైద్యులు తెలిపారు.  
దిలీఫ్ కుమార్ ఆరోగ్యం దెబ్బతిని ముంబైలోని లీలావతి హాస్పిటల్లో గురువారం పొద్దున చేరారు.  డీహైడ్రేషన్ కు లోనైన ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయన కిడ్నీల పరిస్థితి మరింత  విషమంగా తయారైందని  నిర్థారించారు. 
అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు,ప్రాణాపాయమేమి లేదని ఆయన భార్య సైరా భాను పొద్దున మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా పరిస్థితి దిగజారడంతో కుటుంబసభ్యులతో పాటు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)