
ఆమె ఒక లేడీ డాక్టర్. అంతేకాదు ఆమె నిండు గర్భవతి కూడా. ఆమె కాన్పు కోసం ఆసుపత్రిలో జాయిన్ అయింది. మరికాసేపట్లో ఆమెకు డెలివరీ టైం. అంతలోనే ఆమెకు పక్క వార్డనుంచి పెద్దగా అరుపులు వినిపించాయి. తీరా చూస్తే అక్కడ ఒక మహిళ ప్రసవ వేదనతో తల్లడిల్లిపోతున్నది. ఆ సమయంలో ఆమెకు వైద్యం చేసే డాక్టర్ బయటకి వెళ్లారు. దీంతో ఆ నిండు గర్భిణి డాక్టర్ రంగంలోకి దిగింది. ఆ తల్లికి పురుడుపోసింది. తర్వాత వెనువెంటనే తనకూ నొప్పులు తీవ్రమయ్యాయి. తర్వాత సీన్ కట్ చేస్తే ఆమెకు కూడా పండంటి బిడ్డ పుట్టింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
అమెరికాలోని అమండా హెస్ అనే మహిళ డాక్టర్. అంతేకాదు ఆమె తొమ్మిది నెలల నిండు గర్భవతి. మరి కొద్ది నిమిషాల్లో పండండి బిడ్డకు జన్మనివ్వబోతున్నది. అందుకు ఆమె ముందుగానే హస్పిటల్ కి చెరుకొని బెడ్ మీద సిద్దంగా ఉంది. తనకి నొప్పులు ప్రారంభమయాయి. తను డ్రస్ కూడా వేసుకుంది. అంతలోపే పక్క బెడ్ నుండి బాగా శబ్ధాలు వస్తున్నాయి. కారణం లేహ్ హాలిడే జాన్సన్ అనే మహిళకు పురిటి నొప్పులతో తల్లడిల్లిపోతున్నది.
కానీ లేహ్ హాలిడే జాన్సన్ కు అనుకున్న సమయం కన్న ముందుగానే నొప్పులు ప్రారంభమయ్యాయి. అమెకు వచ్చే డాక్టర్ బ్రేక్ పైన బయటికి వెళ్లాడు, తనకి మాత్రం నొప్పులు అధికమతున్నాయి. అందులో సిస్టర్ పక్కన ఉన్న అమండా హెస్ దగ్గరకి వచ్చి విషయం చెప్పింది. కారణం ఆమె కూడా డాక్టర్ కావడం చేత. హెస్ మరో ఆలోచన లేకుండా బెడ్ మీద నుండి దిగి వచ్చి హాలిడే జాన్సన్ కి పురుడు పొసింది. అదే సమయంలో హెస్ కి కూడా నొప్పులు అధికమయ్యాయి కానీ ఆ నొప్పులను భరిస్తు డాక్టర్ గా తన వృత్తికి న్యాయం చేసింది. 42 నిమిషాల పాటు నొప్పులను భరించి లేహ్ హాలిడే జాన్సన్ బిడ్డను భూమి పైకి తీసుకొచ్చింది.
అనంతరం, అమండా హెస్ కూడా బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్ అమండా అమ్మాయికి జన్మనిచ్చింది. లేహ్ హాలిడే జాన్సన్ అబ్బాయికి జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆదివారం అమెరికాలోని కేంటుకే నగరంలో జరిగింది. ఇప్పుడు అమండా హెస్ చేసిన గొప్ప పనికి ప్రపంచం అంతా జేజేలు పలుకుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకు సందేశాలు పంపుతున్నారు.