అజారుద్దీన్ కు అవమానం, విహెచ్ ఆగ్రహం (వీడియో)

First Published Jan 8, 2018, 4:01 PM IST
Highlights
  • హెచ్ సి  ఎ జనరల్ బాడీ మీటింగ్ లో అజారుద్దిన్ కు అవమానం
  • హెచ్ సి ఎ అద్యక్షుడు వివేక్ తీరుపై మండిపడ్డ విహెచ్

 క్రికెటర్ గా ప్రపంచ దేశాల గౌరవాన్ని అందుకున్న లెజెండరీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దిన్ కు సొంత రాష్ట్రంలో  అవమానం ఎదురైంది. హైదరాబాద్ లో జరిగిన హెచ్ సి ఎ ( హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) జనరల్ బాడీ మీటింగ్ కు అతడిని అనుమతించకుండా కార్యవర్గ సభ్యులు అడ్డు చెప్పారు. ఈ సంఘటనతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యాడు. అజారుద్దిన్ తో పాటు మరో కాంగ్రెస్ మాజీ ఎంపి హన్మంతరావు కూడా హెచ్ సి  ఎ పాలకవర్గం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 

ఈ సంఘటనపై అజారుద్దిన్ మాట్లాడుతూ... టీఆర్ఎస్ నాయకుడు, హెచ్ సి ఎ అద్యక్షుడు వివేక్ వ్యవహార శైలిని తప్పుబట్టాడు. ఈ విషయంపై హన్మంతరావు స్పందిస్తూ... వివేక్ హెచ్ సి ఎ సమావేశాన్నిటీఆర్‌ఎస్‌ మీటింగ్ గా బావించి ఇలా వ్యవహరించి ఉంటాడని ఎద్దేవారికెట్ ను వివేక్ భ్రష్టు పట్టిస్తున్నాడని వీహెచ్ మండిపడ్డాడు.

 

సంబంధిత విడియో

click me!