ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్

First Published Aug 10, 2017, 10:56 AM IST
Highlights
  • సభకు వెళ్లే దారిలో ట్రాఫిక్ లో చిక్కుకున్న కేటీఆర్
  • గాంధీ ఆసుపత్రిలో నూతన ఐసీయూ విభాగాన్ని ప్రారంభించిన  గవర్నర్ నరసింహన్
  • నేరెళ్ల ఘటనపై సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో టీడిపి పార్టీ తరపున పోటో ఎగ్జిబిషన్  ఏర్పాటు 
  • కావలి మండలం చింతలపాలెం క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • హ‌మిద్ అన్సారీపై  వెంకయ్య నాయుడు పరోక్ష విమర్శలు
  • నేరెళ్ల ఘటనపై సిసిఎస్  ఎస్ఐ రవీందర్ పై సస్పెన్షన్ వేటు

నేరెళ్ల ఘటనకు పాల్పడిన ఎస్ఐ రవీందర్ పై సస్పెన్షన్ వేటు


నేరెళ్ల ఘటనపై సిసిఎస్  ఎస్ఐ రవీందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. డీఐజీ రవివర్మ ఇచ్చిన నివేదికలో  దళితులను పోలీస్టేషన్ లో చితకబాదింది ఎస్సై అని  తేలింది.అందుకే ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వరంగల్ రేంజ్ ఐజి నాగిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎస్పీ తమను కులం పేరుతో దూషించాడని, థర్డ్ డిగ్రీ ప్రయోగించాడని బాధితులు చెపుతున్నప్పటికి చిన్న స్థాయిలోని ఎస్ఐపై వేటు వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్టు


మేడ్చల్ : ఘట్ కేసర్ మండల కేంద్రం లో అక్రమంగా గంజాయ్ రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసారు. రజాపోతు కిరణ్ (23) అనే యువకుడు 34 గంజాయి ప్యాకేట్లను తరలిస్తుండగా పట్టుకున్నారు. అతడి నుంచి హోండా డియో బైక్ ను  స్వాధీనం చేసుకుని,  రిమాండ్ తరలించిన పోలీసులు తెలిపారు.

అన్నాడీఎంకే లో మళ్లీ  లొల్లి

అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పదవి నుండి తనను తప్పించే అధికారం పార్టీలో ఎవరికి లేదని దినకరన్ అన్నారు. తనను పార్టీ పదవి నుండి సీఎం పళని తప్పించడంపై ఆయన మండిపడ్డారు. ఆయనకే సీఎం పదవి శశికళ పెట్టిన బిక్ష. అలాంటిది ఆమె నియమించిన  పదవి నుంచి ఎలా తొలగిస్తారని విమర్శించారు దినకరన్. తనను తొలగించే అధికారం ఒక్క చిన్నమ్మకే ఉందని దినకరన్  స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్లు దినకరన్ తెలిపారు. 
 

హమీద్ అన్సారీ పై వెంకయ్య పరోక్ష విమర్శలు

గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులను ఖండించిన ఉప రాష్ట్ర‌ప‌తి హ‌మిద్ అన్సారీపై   వెంకయ్య నాయుడు పరోక్ష విమర్శలకు దిగారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అత్యంత సురక్షితంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండియానే అని వెంకయ్య తెలిపారు. కొందరు ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా అసత్య ప్రచారానికి పాల్పడటం తగదని అన్నారు. లౌకిక‌వాదం అనేది భార‌త ప్ర‌జ‌ల ర‌క్తంలోనే ఉంద‌ని, దాన్ని ఎవరు మార్చలేరని వెంకయ్యనాయుడు అన్నారు.
 

కాలుష్యాన్ని తరిమికొడదాం - సుప్రీంకోర్టు

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశలో సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఇకపై కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం ఉంటేనే వాహన బీమాను రెన్యూవల్‌ చేయాలని సాధారణ బీమా సంస్థలను ఆదేశించింది.

కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో సమావేశమైన లోకేశ్‌

 కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో ఏపీ మంత్రి లోకేశ్‌ దిల్లీలో సమావేశమయ్యారు. ఏపీకి రావాల్సిన ఉపాధి హామీ నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా లోక్‌శ్‌ విజ్ఞప్తి చేశారు. ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ఆర్థికసాయం కోరారు.
 

హమీద్ అన్సారి గొప్ప ఉపరాష్ట్రపతి - ప్రధాని మోదీ

ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్‌గా హమీద్‌ అన్సారీ పదేళ్ల కాలంలో చాలా గొప్పగా పనిచేశారని ప్రధాని మోదీ ప్రశంసించారు. నేటితో పదవీకాలం పూర్తి చేసుకుంటున్న అన్సారీకి రాజ్యసభలో జరిగిన వీడ్కోలు చర్చలో ప్రసంగించిన మోదీ.. ఆయన భావిజీవితం ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు.
 

హిమాన్షు మోటార్స్ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం

 హిమాన్షు మోటార్స్‌ వ్యవహారంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై అనర్హత వేటు వేయాలన్న వామపక్షాల ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదు న్యాయపరమైనదని పేర్కొన్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ జగన్‌ వివరణ అందిందని.. దానిపై కలెక్టర్‌ నివేదిక రాగానే పరిశీలించి.. కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామన్నారు.
 

నెల్లూరులో రోడ్డు ప్రమాదం

నెల్లూరు జిల్లా కావలి మండలం చింతలపాలెం క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు  చేసుకుంది. బైకును లారీ ఢీకొట్ట‌డంతో కొండాపురం మండ‌లం సాయిపేట‌కు చెందిన మ‌హేష్ (20) అనే యువ‌కుడు మృతి చెందాడు. మ‌రో యువ‌కుడు ఆంజ‌నేయుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. వారిని సమీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

భర్తే కాలయముడైతే

నెల్లూరు జిల్లా కావలి మండలం నడుంపల్లి లో దారుణం జ‌రిగింది. కుటుంబ క‌ల‌హాల‌తో భార్య  అరుణ‌(25) ను భ‌ర్త శ్రీను గొంతు కోశాడు. అరుణ‌ ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో కావ‌లి ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
 

నేరెళ్ల భాదితులకు అండగా ఉంటాం

నేరెళ్ల ఘటనపై రాజకీయ పక్షాలన్ని ఒక్క తాటిపైకి వచ్చాయి. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో టీడిపి పార్టీ తరపున ఏర్పాటు చేసిన పోటో ఎగ్జిబిషన్ కు  అన్ని పార్టీల కీలక నాయకులు పాల్గొన్నారు. నేరెళ్ల ఘటనపై కేసీఆర్ బందువుల పాత్రపై రిటైర్ జడ్జీతో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి ద్వజమెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా ఇసుక దళారుల వల్ల అన్యాయానికి గురైన నేరెళ్ల ప్రజలకు మనోదైర్యాన్ని కల్పించనున్నామని అఖిలపక్ష నేతలు తెలిపారు.  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ , టీడీపీ నేతలు రమణ, రేవంత్ రెడ్డి లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

చంద్రబాబుకు స్వల్ప అస్వస్థత


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. రాజధాని అమరావతిలో నిర్మించనున్న మెడిసిటీ భవన శంకుస్థాపన లో పాల్గొన్న ఆయన నీరసంగా ఉన్నారు. తుళ్లూరు మండలం దొండపాడులో జరిగిన బహిరంగ సభలో తన ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. రెండు నిమిషాల విశ్రంతి తీసుకుని ప్రసంగాన్ని కొనసాగించారు.  ముఖ్యమంత్రి పరిస్థితిని గమనించి సీఎంవో అధికారులు అప్రమత్తమయ్యారు.

సీఎం సభలో నిరసనల వెల్లువ


నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ లో జరిగిన సభలో గందరగోళం జరిగింది.  నిర్మల్ జిల్లా కడెం మండలం గంగపూర్ సర్పంచ్ శంకర్ నాయక్ సీఎం సభా ప్రాంగణంలో హోర్డింగ్ ఎక్కి నిరసన తెలిపారు.తమ గ్రామానికి రోడ్డు వంతెన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయన హోర్డింగ్ పై ఉన్న సమయం లొనే బాల్కొండ కు చెందిన విజయ లక్ష్మి అనే మరో యువతీ కూడా నిరసన తెలిపారు. ఎన్నోసార్లు ఎంఎల్ ఏ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని ఆరోపించారు. బాధితుల నిరసనలు కొనసాగుతుండగానే  కేసీఆర్ సభను ముగించి వెళ్లిపోయారు.పోలీస్ లు వారిని సముదాయించి కిందకు దింపారు.సభ వద్ద ఈ ఘటన కలకలం రేపింది.

వన్డే సీరిస్ కు దూరం కానున్న విరాట్ కోహ్లీ

ఈ నెల 20నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న  వన్డే సీరిస కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు. వరుస సీరీస్ లతో తీరిక లేకుండా ఆడుతున్న కొందరు ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అందులో బాగంగా కెప్టెన్ విరాట్ తో పాటు రవీంద్ర జడేజా, ఉమేశ్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహమ్మద్‌ షమిలను కూడా శ్రీలంక వన్డే సీరిస్ నుంచి విశ్రాంతి నిచ్చింది. ఆతిథ్య లంకతో భారత్‌ ఆడనున్న ఐదు వన్డేల సిరీస్‌ మొత్తానికి వీరు దూరం కానున్నారు. 
 

తానుకూడా గాంధీ  హాస్పిటల్లోనే వైద్యం చేసుకుంటా - గవర్నర్ నరసింహన్

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నూతనంగా నిర్మింయిన ఐసీయూ విభాగాన్ని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. అలాగే హాస్పిటల్లో రోగుల సహాయార్థం ఏర్పాటుచేసిన అల్ట్రాసౌండ్ యూనిట్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సంధర్బంగా గవర్నర్ మాట్లాడుతూ ఇకపై పేదలే కాదు  తాను కూడా గాంధీ లోనే చికిత్స చేయించుకుంటానన్నారు.  ఇకపై నెలకోసారి ఆసుపత్రి గురించి సమీక్ష నిర్వహిస్తానన్నారు.  గాంధీలో ఉన్న చిన్న సమస్యలను పెద్దగా చేసి చూపొద్దని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ లు కూడా పాల్గొన్నారు.

ట్రాఫిక్ లో చిక్కుకున్న కేటీఆర్

ఆర్మూర్ ప్రాంతంలో రెండు గంటలుగా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన మంత్రి కేటీఆర్ 

సభకు వెళ్లే వందలాది వాహనాలు కదలక పోవడంతో ముందుకు కదలని మంత్రి వాహన శ్రేణి

‘జగన్’ మీద కోడిగుడ్లతో దాడి

చంద్రబాబునాయుడిపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు, నేతలు నుడా చైర్మన్ కోటం రెడ్డి ఆధ్వర్యంలోనిరసన కార్యక్రమం పట్టారు..  జగన్ వేషదారణలో ఉన్న వ్యక్తిపై కోడిగుడ్లు విసురుతూ నిరసన వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ  జగన్మోహన్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. రాష్టాభివ్రుద్దికోసం అహర్నిశలు క్రుషి చేస్తున్న చంద్రబాబు నాయుడ్ని కాల్చేయాలనడం ఆయన నేర ప్రవ్రుత్తికి నిదర్శమన్నారు..

నెల్లూర్ బంద్ పాక్షికం

నెల్లూరు జిల్లా ఎస్ ఎఫ్ ఐ చేపట్టిన బంద్ పాక్షికంగా జరుగుతోంది.. ప్రభుత్వ పాఠశాల ముడివేతకు నిరసన గా వాళ్ళు బంద్కి పిలుపునిచ్చారు..

చిరు అభిమానుల రక్తదానం

నెల్లూరు జిల్లా చిరంజీవి యువత తలపెట్టిన 40 రోజుల మెగాస్టార్ చిరంజీవి  జన్మదిన వేడుకల్లో బాగంగా ఇవాళ గూడూరు రోటరీ క్లబ్ భవన్ లో  చిరంజీవి యువత జాతీయ నాయకులు కె.మునిగిరేశ్  అద్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు...

లాలూ ప్రసాద్ సన్నిహితుడి హత్య

రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ)అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ అత్యంత సన్నిహితుడు కేదార్‌ రాయ్‌ దారుణ హత్యకు గురయ్యారు. పట్నాలోని దనపూర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం మార్నింగ్‌ వాక్‌ నిమిత్తం బయటకు వెళ్లిన కేదార్‌ రాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాయ్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతిచెందారు.

 చీరాలలో సినిమా హాల్ దగ్ధం

చీరాల ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని సురేశ్‌ మహల్‌ సినిమా హాలు అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. దివంగత దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి చెందిన ఈ సినిమా హాల్‌ను మరమ్మతులు చేసి రెండు థియేటర్లుగా అత్యాధునిక టెక్నాలజీతో తీర్చిదిద్దారు. ఒక థియేటర్‌ పూర్తి కావడంతో రేపు రామానాయుడు మనవడు, సినీ హీరో రానా చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. అయితే ఈరోజు ఏసీలు బిగించే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

 

విదేశీయుల ఇళ్లలో సోదాలు

హైదరాబాద్‌ నగరంలో నివాసముంటున్న విదేశీయుల ఇళ్లల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. వీసా గడువు కాలం ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉంటున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. గురువారం ఉదయం నుంచి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో నివాసముంటున్న విదేశీయుల ఇళ్లల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. 

దుండగుడి దాడిలో మహిళకు గాయాలు

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్‌ సమీపంలోని ఓ ఇంటిలో దుండగుడు బీభత్సం సృష్టించాడు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు తలుపులు మూసేసి ఒంటరిగా ఉన్న మహిళపై కత్తితో దాడికి పాల్పడి పరారయ్యాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు బాధితురాలిని హుటాహుటిన ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఒఆర్ ఆర్ మీద ఆగని ప్రమాదాలు

హైదరాబాద్‌ నగర శివారు కొల్లూరు సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్డుపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఓ కారును గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు పూర్తిగా ధ్వంసం కావడంతో అందులో ప్రయాణిస్తున్న తాడ్‌బండ్‌కు చెందిన జవరుద్దీన్‌, బహుదూర్‌పురాకు చెందిన షకీల్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

 

శంకరంబాడి సుందరాచారి ఓ సుందర కవి - చంద్రబాబు

 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మాతెలుగుతల్లికి మల్లెపూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి నేడే. దీన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన నివాళి అర్పించారు. తెలుగు జాతి ఉన్నంతకాలం సుందరాచారి పేరు నిలిచివుటుందని కొనియాడారు సీఎం. ఈ గీతాన్ని ఆయన ప్రాంతీయవిభేదాలు లేనప్పుడే రాశారన్నారు. ఎస్వీ యూనివర్శిటీ ఆయనకు ప్రసన్నకవి బిరుదునిచ్చి గౌరవించడాన్ని గుర్తుచేసుకున్నారు బాబు.  సుందర రామాయణం లాంటి కావ్యాలను రాసిన సుందరాచారి సుందరకవిగా గుర్తింపు పొందారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
 

నేరెళ్ల ఘటనపై పోలీసుల నివేదిక

కరీంనగర్ రాజన్న జిల్లా నేరెళ్ల ఘటనపై డీఐజీ రవివర్మ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఐజీ కార్యాలయానికి చేరవేసిన ఈ  నివేదికను కాన్ఫిడెన్షియల్ ఫైల్ గా తయారు చేసారు.  ఈ రిపోర్ట్ ను కిందిస్థాయి ఉద్యోగులను బలి చేయడానికి వాడుకోనున్నారని తెలుస్తుంది. ఉన్నతాధికారులపై చర్యలేమీ లేకుండా కిందిస్థాయిలోనే చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని సమాచారం.
 

అక్రమ కట్టడాల కూల్చివేతలో ఉద్రిక్తత


హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న GHMC అధికారులను హయత్ నగర్ లో స్థానికులు అడ్డుకున్నారు.  ఇండ్ల కూల్చివేతకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు కూడా తోడవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జేసిబీ కి అడ్డుగా కూల్చివేత భవనాలవద్ద  కూర్చుని ఆందోళన చేస్తున్నారు.
 

నంద్యాలలో జగన్ రెండోరోజు ప్రచారం

 
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి నూనెపల్లె నుండి రెండవరోజు రోడ్‌ షో ప్రారంభించారు. ఈ రోజు మొత్తంగా నూనెపల్లి నుండి అయ్యలూరు వరకు ఈ ప్రచార కార్యక్రమం సాగనుంది.  ఉప ఎన్నికలు రావడంతోనే చంద్రబాబు నంద్యాలలో అభివృద్ది పేరుతో హడావుడి మొదలెట్టినట్లు జన్ విమర్శించారు.   ప్రజలు అన్ని గమనిస్తున్నారని,ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో వారికి తెలుసన్నారు జగన్.

శ్రీవారి సేవలో లై సినిమా బృందం


 రేపు లై మూవీ విడుదల కానుండటంతో సినిమా బృందం ఇవాళ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో హీరో నితిన్,హీరోయిన్ మేఘ ఆకాష్,నటుడు మదునందన్ స్వామి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సినిమా విడుదలను పురస్కరించుకుని తిరుమలకు వచ్చినట్లు హీరో నితిన్ తెలిపారు. తమ సినిమాపై భారీ అంచనాలు ఉన్నందున విడుదల గురించి తానుకూడా ఎదురుచూస్తున్నట్లు నితిన్ తెలిపాడు.   
 

మున్సిపల్ శాఖ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  
అమరావతిలోని ఏపీ సచివాలయంలో మున్సిపల్ శాఖ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ను   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీ లను ఈ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ కు అనుసంధానించారు. మున్సిపాలిటీ ల్లోని సానిటేషన్, రోడ్స్ , డ్రైనేజ్ వంటి సమస్యలను ఎప్పటికప్పుడు కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుండి పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమంలో  సీ.యస్. దినేష్ కుమార్ తో పాటు, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో  సమస్యలను  తొందరగా పరిష్కరించడానికి కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి  చంద్రబాబు తెలిపారు.
 

పతనం దిశగా రూపాయి విలువ


గత కొంత కాలంగా దూకూడుమీదున్న రూపాయి మారకం విలువ నేడు కుప్పకూలింది. ప్రారంభ ట్రేడింగ్ లోనే రూపాయి విలువ 26 పైసలు పడిపోయింది. గత కొంత కాలంగా పడిపోతున్న డాలర్‌ విలువ ప్రస్తుతం రికవరీ అవుతోంది. అందువల్ల బ్యాంకర్ల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో రూపాయి క్షీణిచిందని మార్కెట్‌ విశ్లేషకలు చెబుతున్నారు.  ప్రస్తుతం  రూపాయి విలువ 63.97 వద్ద ఉంది. 

రాజీవ్‌గాంధీ సద్భావన జ్యోతి యాత్ర ప్రారంభం

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ యస్ యస్ ప్రకాష్ అధ్వర్యంలో రాజీవ్‌గాంధీ సద్భావన జ్యోతి యాత్ర ప్రారంభమైంది.రాజీవ్‌గాంధీ మరణానంతరం పెరంబదుర్ నుండి గత 26 సంవత్సరాలు గా ఈ యాత్ర నిర్వహిస్తున్నారు.
10రోజులు పాటు జరిగే యాత్ర నిన్న తమిళనాడు లోని పెరంబదుర్ నుండి  ప్రారంభమై  నాయుడుపేట,నెల్లూరు,ఒంగోలు మీదుగా రాత్రి విజయవాడ చెరుకుంది. ఈ జ్యోతి కి విజయవాడ లో ఘనంగా స్వాగతం పలికారు. 
ఈ ఉదయం విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుండి రెండో రోజు యాత్రను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు  ప్రారంభిచారు. విజయవాడ నుండి కలకత్తా,  ఒరిస్సా, వారణాసి, అలహాబాద్, అమెదీ ,రాయబరేలి, లక్నో మీదుగా 19వ తేదీ డిల్లీ చేరుకుంటుంది. పార్లమెంటు హల్  వద్రాద గల రాజీవ్‌గాంధీ విగ్రహం దగ్గర సోనియా గాంధీ ,రాహుల్ గాందీ కి సంద్భావన జ్యోతి ని అందించనున్నారు.
అనంతరం అగస్టు 20వ తేది రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్‌గాంధీ ఘాట్ దగ్గర జ్యోతి తో నివాళులు అర్పించనున్నారు..

బేగంపేట బాంబుకేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

 బేగంపేట బాంబు పేలుడు కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న కేసులో  6 గురు నిందితులను నిర్ధోషులుగా ప్రకటించింది. 2005 లో టాస్క్ పోర్స్   కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడిలో సరైన ఆధారాలు లేవని, కేసును కొట్టివేస్తున్నట్లు నాంపల్లి కోర్టు తెలిపింది.

ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం


ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అక్కడే ఏన్పాటుచేసిన పునరుజ్జీవ పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు. పోచంపాడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి మధ్యాహ్నం పాల్గొననున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేసీఆర్ వెంట మంత్రులు ఈటెల, హరీశ్‌రావు, పోచారం, ఇంద్రకరణ్రెడ్డి తదితరులు ఉన్నారు.  

డ్రగ్స్‌ కేసులో  మరో నైజీరియన్ అరెస్ట్‌


గోవా నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న  గాబ్రియేల్ అనే నైజీరియన్ ను హైదరాబాద్ లోని యాప్రాల్ వద్ద  పోలీసులు అరెస్ట్ చేసారు. కొంత కాలంగా హైదరాబాద్ లోని నైజీరియన్ల ముఠాకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న అతడిపై నిఘా ఉంచిన టాస్క్ పోర్స్ పోలీసులు , పక్కా సమాచారంతో   పట్టుకున్నారు.  ఓ అపార్ట్‌మెంట్‌లో  ప్రియురాలితో కలిసివున్న గాబ్రియేల్‌  అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు.
 

నేడు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌


నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.  విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ దృష్ట్యా విద్యాసంస్థలు బంద్ ను పాటించే అవకాశమున్నది. ఈ సమస్యలపై వెంటనే పరిష్కారం చూపాలంటూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహించాలన్న విషయం తెలిసిందే.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి తో నారా లోకేష్ భేటీ

 

ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని కలిసారు. ఎపిజె అబ్దుల్ కలాం రోడ్డులోని  ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉపరాష్ట్రపతి గా ఎన్నికైన వెంకయ్యనాయుడుకు అభినందనలు తెలిపారు మంత్రి  లోకేష్.

జగిత్యాల గులాబి దండు కదిలింది

 
నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత జగిత్యాల టిఆరెస్స్ పార్టీ ఆఫీసు నుండి పోచంపాడ్ పునర్జీవ సభకు కు ట్రాక్టర్ల ర్యాలీని   ప్రారంభించారు. రైతులు తమ ట్రాక్టర్ల ను అందంగా అలంకరించుకుని వేలాదిగా బయలుదేరారు.  రోడ్ల గులాబీ జెండాలతో కూడిన  ట్రాక్టర్లు వరుసకట్టడంతో  జగిత్యాల గులాబీమయమయ్యింది. 

click me!