ఎక్స్ ప్రెస్ న్యూస్ : బూట్లతో పూజ చేస్తున్న ఏపి మంత్రి అచ్చెన్న

First Published Nov 6, 2017, 11:14 AM IST
Highlights

విశేష వార్తలు

  • రేవంత్ ను విమర్శించి, కాంగ్రెస్ ను ప్రశంసించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • తోపులాటలో ఎమ్మార్పిఎస్ మహిళా కార్యకర్త మృతి
  • తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ భరత్ భూషన్ కు సాయం చేయండి
  • మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో భారీ చోరి
  • మెట్పల్లి ఎస్సై వేధింపులతో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

బూట్లతో పూజ చేస్తున్న ఏపి మంత్రి అచ్చెన్న

యదా బాబు!! తదా మంత్రి !!!
అయ్యో అచ్చన్న...  మన సికాకుళంలొ ఇలగనేటి  పూజ సేస్తారు!!
ఎం భక్తి ఎం భక్తి!! సిన్నప్పుడు నుండి ఇలాగన ఈమద్యనే ఇలగ సెస్తన్నవా!!!
నేను మీ కిరణ్ 
అంటూ రాసున్న క్యాప్షన్ తో పై పోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
 

''జగన్ పొర్లు దండాల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు''

వైకాప అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించాడు.  జగన్ పాదయాత్ర కాదు పొర్లు దండాల యాత్ర చేపట్టినా ప్రజలు వైసీపి పార్టీసి నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు పాదయాత్ర చేసి వారి కష్టాలను తెలుసుకోవాలి కానీ సుఖసంతోషాలతో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఇబ్బందిపెట్టేలా ఈ పాదయాత్ర ఏంటని ప్రశ్నించారు. ఈ యాత్ర ముగిసేసరికి వైసిపి లో జగన్ కుటుంబం తప్ప ఎవరూ మిగలరని విమర్శించారు అచ్చెన్నాయుడు.  
 

మహిళలపై మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

మహారాష్ట్ర బిజెపి మంత్రి గిరీష్ మహజన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. డిల్లీలో ఓ మద్యం వ్యాపారికి సంభందించిన కార్యక్రమానికి హాజరైన గిరీష్ మద్యం విక్రయాలు పెరగాలంటే  వాటికి అమ్మాయిల పేర్లు పెట్టాలంటూ వివాదాస్పదంగా మాట్లాడాడు. అమ్మాయిల పేర్లు పెడితే మందుబాబులు ఆకర్శితులవుతారన్నది మంత్రి గారి ఉద్దేశం. అయితే గౌరవ మంత్రి ఇలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.
 

కాంగ్రెస్ పార్టీని పొగిడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ని విమర్శించే క్రమంలో కాంగ్రెస్ పార్టీని పొగడ్తలతో ముంచెత్తాడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. కొడంగల్ ఎమ్మేల్యే రేవంత్ రెడ్డి చిన్న నీటి బిందువు లాంటి వాడని, కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని, ఈ చిన్న నీటి బిందువు సముద్రంలో కలవడంలో విశేషమేముందో తనకు అర్థం కావడంలేదన్నారు. ఎందరో మహామహులున్న కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేసేదేమి లేదన్నారు. ఇలా రేవంత్ పై విమర్శలు చేసినప్పటికి, కాంగ్రెస్ ను మహాసముద్రం, నాయకులను మహామహులతో పోల్చి ప్రశంసించినట్లే కనిపించిందని ఆయన మాటలు విన్నవారు అభిప్రాయపడుతున్నారు.  
 
 

ఎమ్మార్పిఎఫ్ కార్యకర్త భారతి కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా
 

హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో మృతిచెందిన ఎమ్మార్పిఎఫ్ మహిళా కార్యకర్త భారతి కుంటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళిత ఎమ్మార్పిఎఫ్ కార్యకర్త భారతి(40) మరణం చాలా దురదృష్టకరమని, ఈ ఘటన తననెంతో ఆవేదనకు గురిచేసినట్లు సీఎం తెలిపారు. ఈ ఘటన పై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ  కు కట్టుబడే ఉందని, దీన్ని తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని కేసీఆర్ వివరించారు.
 

తోపులాటలో ఎమ్మార్పిఎస్ మహిళా కార్యకర్త మృతి
 

ఎస్సీ వర్గీకరణ ఎమ్మార్పిఎస్ చేపట్టిన జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా ఈరోజు హైదరాబాదు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పోలీసులకు, ఎమ్మార్ఫీఎస్ కార్యకర్తలకు జరిగిన తోపులాట లో భారతి అనే మహిళా నాయకురాలు మృతి చెందింది. దీంతో ప్రభుత్వ, పోలీసుల వైఖరిని నిరసిస్తూ అసుపత్రి వద్ద ఎమ్మార్పిఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. 

భరత్ భూషన్ కు సాయం చేయండి

అతడు తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ ప్రజలను తన పోటోలతో ఉద్యమస్పూర్తి రగిల్చిన ఫోటో జర్నలిస్ట్. తెలంగాణ మొదటి వార్షికోత్సవం రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్ర అవార్డు తీసుకున్న మేటి పోటోగ్రాఫర్.  తెలంగాణ గ్రామీణ జీవితం, బతుకమ్మ పండుగల విశిష్టతను తన పోటోలతో విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి. అతడే తెలంగాణ ఫోటో జర్నలిస్టు గౌడిమల్ల భరత్ భూషన్ .
తెలంగాణ సంస్కృతిని బతికించిన అతడు ఇపుడు చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతడి మూత్రపిండాల పనితీరు క్షీణించడం,అధిక చక్కెర, తీవ్రమైన మూత్ర వ్యాధి, తేలికపాటి గుండెపోటు లాంటి అనేక సమస్యలతో భాదపడుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని మాక్స్ క్యూర్ మెడిసిటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 కానీ ఆసుపత్రిలో  అతడి కుటుంబం ఆస్పత్రి ఖర్చులు భరించలేని దీన స్థితిలో ఉంది. అతడి వైద్య ఖర్చులకు  రూ .7 లక్షల వ్యయం అవుతుందని డాక్టర్లు తెలిపారు. దీంతో ఎటూ పాలుపోని కుటుంబం దాతల కోసం ఎదురుచూస్తోంది. మన తెలంగాణ సంస్కృతిని కాపాడిన అతడ్ని మనం కాపాడుకోవడం బాధ్యత. కావున దాతలు ముందుకు వచ్చి అతడి ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నాం.
 

మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
 

సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే కాగజ్ నగర్ లోని ఓ కాలనీలో బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి గాయాలపాలై రోడ్డుపైన పడివున్నాడు. ఎవరూ అతడిని హాస్పత్రికి తీసుకుళ్లడానికి కూడా ముందుకు రావడం లేదు. అదే సమయంలో ఈస్ గాం వైపు నుండి కాగజ్ నగర్ వైపు వస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గాయాలతో పడివున్న వ్యక్తిని గుర్తించారు. సదరు వ్యకిని వెంటనే తన వాహనంలో దగ్గరుండి మరీ ఆస్పత్రికి తరలించాడు. దీంతో అక్కడున్న వారంతా ఎమ్మెల్యే మంచితనాన్ని కొనియాడగా,బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపారు.

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో భారీ చోరి

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆయన ఇంట్లోనే పనిచేస్తున్న చెన్నయ్య అనేవ్యక్తి 2 లక్షల  నగదును చోరీచేసి ఉడాయించాడు. దీంతో చిరంజీవి మేనేజర్ గంగాధర్ జూబ్లీహిల్స్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.
 

ఎస్సై వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మెట్ పల్లి మండలం ఆరవపేటకు చెందిన దశరథ్ రెడ్డి ఓ కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే దశరథ్ రెడ్డి కుటుంబాన్ని ఓ భూ వివాదం కేసులో గత కొన్ని రోజులుగా మెట్ పల్లి ఎస్సై వేధింపులకు గురిచేస్తున్నాడు. దీన్ని తట్టుకోలేక దశరథ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్సై తీరుకు నిరసనగా కుటుంబ సభ్యులు , గ్రామస్తులు కలిసి కోరుట్ల రహదారిపై ఆందోళనకు దిగారు.  

దేశవ్యాప్తంగా మరో 100 నూతన విమానాశ్రయాలు

రానున్న 15 సంవత్పరాలలో దేశంలో మరో 100 విమానాశ్రయాలు నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్ర విమానయాన అభివృద్ది శాఖ తెలిపింది. దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలలో వీటిని నిర్మించడానికి చర్యలు చేపడుతున్నట్లు విమానయాన అధికారులు తెలిపారు.4 లక్షల కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు.  విమానయానాన్ని సామాన్యులకు సైతం అందుబాటులో తేవడానికి ఈ బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు మంత్రి తెలిపారు.
 

''కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడతాం''

మరో ఉద్యమాన్ని నిర్మించి కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడతామని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  తీసుకురావడానికి అందరం ఐక్యంగా పోరాడతామని అన్నారు. అనుభవజ్ఞులైన పొన్నాల సలహాలు.. సూచనలను తీసుకోవడానికి ఆయనతో భేటీ అయినట్లు రేవంత్ తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులతో పాటు పార్టీ కార్యక్రమాలపై ఆయనతో చర్చించినట్లు, పార్టీ భవిష్యత్ కార్యచరణ త్వరలో అందరం కలిసి నిర్ణయిస్తామని రేవంత్ తెలిపారు.
 

భూపాలపల్లి జిల్లాలో నడీరోడ్డుపై బాంబులు
 

భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలం అలుబాక సమీపంలోని రహదారిపై పోలీసులు రెండు బాంబులను గుర్తించారు. పోలీసుల వాహనాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు ఈ బాంబులు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న బాంబు స్క్వాడ్ బాంబులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రహదారిపై బాంబులు ఉండటంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయారు. పోలీసులు బాంబుల వద్దకు ప్రజలేవరు రాకుండా పహారా కాస్తున్నారు.

''నేనూ డీజిపి రేసులో వున్నా''

తెలంగాణ నూతర డీజిపి రేసులో తాను కూడా ఉన్నట్లు ఐపిఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ తెలిపారు. ప్రభుత్వ పరిశీలనలో వున్న పేర్లలో తన పేరు కూడా ఉందని అన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఇంచార్జ్ డీజీపీని నియమిస్తుందని, పూర్తిస్థాయి డీజీపీ కోసం కేంద్రం నుంచి తుది జాబితా వచ్చే వరకు వేచి చూడాలని అన్నారు.  

click me!