ఎక్స్ ప్రెస్ న్యూస్ :వైసీపి పాదయాత్రలో మీడియా తిప్పలు

First Published Nov 5, 2017, 11:35 AM IST
Highlights

విశేష వార్తలు

  • కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన యనమల 
  • ఆరవ రోజుకు చేరుకున్న ఉక్కు ఉద్యమం
  • ఐలయ్య కు వ్యతిరేకంగా తార్నాకలో వెలిసిన వాల్ పోస్టర్లు
  • మల్కాజిగిరి కార్పోరేటర్ కొడుకుపై పిడి యాక్టు నమోదు చేయాలంటూ ధర్నా 
  • ఆస్ట్రేలియా యువసేన ఆద్వర్యంలో పాదయాత్ర

వైసీపి పాదయాత్రలో మీడియా తిప్పలు 

 
వైసీపీలో అధినూత జగనకవోహన్ రెడ్డి పాదయాత్ర కవరేజ్ కోసం వెళుతున్న మీడియా సభ్యులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. హైదరాబాద్ రుంచి ఇడుపుల పాయకు మీడియా ప్రతినిధులతో బయల్దేరిన బస్సు  కండీషన్ సరిగా లేక మధ్యలోనే ఆగిపోయింది.  ఉదయం 9 గంటల నుండి మీడియా సభ్యులు అక్కడే రోడ్డుపై పడిగాపులు పడుతున్నారు. ఇప్పటివరకు వారిని కనీసం పట్టించుకునే వారు లేకుండా పోయారు. 

కేసీఆర్ పై యనమల ప్రశంసల వర్షం 

 
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను ఆర్థిక మంత్రి ప్రశంసలతో ముంచెత్తారు. దీంట్లో విశేషం ఏం ఉందనుకుంటున్నారా ? అయితే మీరీ వార్త చదవాల్సిందే.

అయితే కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తింది తెలంగాణ ఆర్థిక మంత్రి కాదు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్టుడు. కోట్లాది రూపాయలతో యాదాద్రి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ ను అభినందించకుండా ఉండలేకపోతున్నానని ఆకాశానికి ఎత్తేశారు. దేవాలయాలను అభివృద్ది చేసి మన పూర్వీకుల చరిత్రను కేసీఆర్ కాపాడుతున్నారని అన్నాడు.  తిరుమల ఏపీలో ఎలా వులుగొందుతుందో, యాదాద్రి తెలంగాణ లో అలా వెలుగొందాలని ఆశిస్తున్నట్లు యనమల తెలిపారు.  

ఇంటింటికి ఉక్కు ఉద్యమం-ఆరవ రోజు

రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ యువత కోసం స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగాలని అందుకోసం ప్రతి ఇంటి నుంచి ఒక ఉక్కు సైనికుడు ఉద్యమంలో పాల్గొనాలని స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందుకోసం గత 6వ రోజులుగా ఇంటింటికి ఉక్కు ఉద్యమం కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈ ఉక్కు ఉద్యమ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని ప్రవీణ్ తెలిపారు.
 

తార్నాకలో ఐలయ్య కు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు

తార్నాక లో కంచె ఐలయ్య కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశారు. అతడి ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే ఈ పోస్టర్లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గోడలపై అంటించారు. అజ్ఞాని, మూర్ఖుడు అయిన ఐలయ్యను క్షమించుకుందాం.. హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం.. జై శ్రీరామ్ అంటూ రాసివున్న పోస్టర్లను ఐలయ్య ఇంటిచుట్టుపక్కల దర్శనమిస్తున్నాయి. 
 

''ఆ కార్పొరేటర్ కొడుకుపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి'' (వీడియో)

 

యువతుల్ని లైంగికంగా వేధిస్తున్న మల్కాజిగిరి కార్పోరేటర్ కుమారునిపై పీడి యాక్ట్ నమోదుచేయాలని అఖిలపక్షం ఆద్వర్యంలో మల్కాజిగిరి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.  ఇదివరకే వేధింపుల కేసులో అరెస్టై తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బయటకు వచ్చినా తీరు మారని అభిషేక్ గౌడ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని  డిమాండ్ చేశారు.
అలాగే కొడుకు వేధింపులకు భాద్యత వహిస్తూ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ కూడా వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్  చేశారు. అధికారం ఆడ్డం పెట్టుకొని తండ్రి సెటిల్మెంట్లు చేస్తుంటే కుమారుడు కామం తో అమ్మాయిలను వేధిస్తున్నాడని వారు మండి పడ్డారు.

ఆస్ట్రేలియా లో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువసేన పాదయాత్ర

 వైఎస్ జగన్ చేపట్టనున్న సంకల్పయాత్రకు మద్దతుగా ఆస్ట్రేలియా వైస్సార్సీపీ యువసేన ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర జరిగింది.  చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి అద్యక్షతన ఈ పాదయాత్ర జరిగింది.    ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వెఎస్సార్సీపి యువసేన నాయకులు ప్రకాష్ నాయుడు తాడి,నరేందర్ కొక్కొండ, భార్గవ్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి,గోపి,ఫణి, దేవరపల్లి శివ,లోకేష్ లు పాల్గొన్నారు

click me!