బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ సమాచారం

First Published Sep 25, 2017, 11:49 AM IST
Highlights

విశేష వార్తలు

  •  నేడు కనకదుర్గమ్మను దర్శించుకున్న భక్తుల సంఖ్య 51,693 (సాయంత్రం వరకు)
  • పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ అవార్డ్
  • ముస్సోరీలో ఐఎఎస్ ల శిక్షణ శిబిరంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 
  • టీఎంసి ని వీడనున్నట్లు ప్రకటించిన ఎంపి ముకుల్ రాయ్
  • లలితాదేవి అవతారంలో బెజవాడ దుర్గమ్మ
  •  ఆర్టీఐ చీఫ్ కమీషనర్, కమీషనర్ ల ప్రమాణ స్వీకారం

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ సమాచారం

దుర్గగుడి ఈవో సూర్యకుమారి  అందించిన సమాచారం

శ్రీ లలితా త్రిపుర‌సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను  సాయంత్రం వరకు 51693 భక్తులు అమ్మవారిని  దర్శించుకున్నారు.

 300 /- టికెట్స్  3250 కొనుగోలు 

100 /- టికెట్స్ 4094 కొనుగోలు జరిగాయి...

 51700 లడ్డూ అమ్మకాలు

22850 పులిహార అమ్మకాలు 

 అన్నదానంలో  9698 భక్తులు పాల్గొన్నారు....

మూలానక్షత్రం రోజున  ముఖ్యమంత్రి చంద్రబాబు  అమ్మవారి ని దర్సించుకొబొతున్నారు

ములానక్షత్రం రోజు రాత్రి 1 గంట నుంచే  అమ్మవారి దర్శనానికి భక్తులకు  అనుమతి..రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది

మూలానక్షత్రం రోజున అన్నీ ఉచిత దర్శనాలే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ అవార్డు

జనసేన అద్యక్షుడు, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక ఇండో యురోపియన్ గ్లోబల్ ఫోరమ్ అందించే ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు గల వారికి ఏటా ఈ అవార్డును అందిస్తారు. ఈ సారి ఈ అంతర్జాతీయ అవార్డుకు పవన్ ను ఎంపికయ్యాడు. నవంబర్ 17 బ్రిటన్ లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్ లో జరిగే గ్లోబల్ బిజినెస్ మీట్ సమావేశంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.  
 

గత పాలకుల బాటలోనే తెలంగాణ ప్రభుత్వం 

తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాల మాదిరాగానే నేటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దళితులను అణచివేతకు గురి చేస్తోందని సామాజిక ఉద్యమకారుడు గద్దర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆంధ్రా పాలకుల బాటలోనే ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశాడు. ఇవాళ టీ మాస్ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనాధిగా ధళిత, బడుగు బలహీన వర్గాల హక్కులను అణచివేస్తున్నాయని, వీటికి తెలంగాణ ప్రభుత్వమేమీ అతీతం కాదని గద్దర్ విమర్శించారు.
 

రైతుల సంక్షేమంకోసమే భూ రికార్డుల ప్రక్షాళన - గవర్నర్

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి రైతులు సహకరించాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. రైతుల మద్య గొడవలను తగ్గించడంతో పాటు, ప్రభుత్వనికి సమగ్రమైన సమాచారం తెలియడానికి ఈ ప్రక్షాళన కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఈ సర్వే ద్వారా ఎవరికి ఎంత భూమి ఉందో తెలుస్తుందని, ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం రైతుల సంక్షేమ కార్యక్రమాలను చేపట్టే అవకాశం ఉంటుందని గవర్నర్ తెలిపారు.

ఇంకా చంద్రబాబు కనుసన్నల్లోనే ఏఐటీయూసి

ఆంధ్ర సీఎం చంద్రబాబు కనుసైగల్లో పనిచేసే ఏఐటీయూసి కూటమి మరోసారి సింగరేణి కార్మికులను మోసం చేయాలనీ చూస్తోందని పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ ఆరోపించారు.మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆర్కే 7 గని వద్ద జరిగిన సమావేశంలో కార్మకులనుద్దేశించి మాట్లాడారు.సింగరేణి వారసత్వ ఉద్యోగాల కల్పించాలంటే అది  సీఎం కెసిఆర్ నాయకత్వం తోనే సాధ్యమని అన్నారు.తమ ప్రభుత్వం ఉన్నన్నిరోజులు సింగరేణి సంస్థ ను ప్రయివేటు పరం కనివ్వమని హామీ ఇచ్చారు.
సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను ను తొలగించాలని పార్లమెంటులో నా మొదటి సమావేశం లొనే డిమాండ్ చేశానని సుమన్ గుర్తు చేశారు.
 

ఉదయ సముద్రం ప్రాజెక్ట్ పనులపై మంత్రి హరిష్ రావు సమీక్ష (వీడియో)

డిసెంబర్ కల్లా ఉదయసముద్రం ప్రాజెక్టు పూర్తిచేసి తీరతామని నీటిపారుదల శాఖ మంత్రి హరిష్ రావు హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నకిరేకల్, మునుగోడు, నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గాల ప్రజలు, రైతులు ఎంతో  లభ్ధి పొందనున్నారని ఆయన తెలిపారు. మంత్రి హరీశ్ రావు స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ,ఎంఎల్ఏ వీరేశం, బండా నరేందర్ రెడ్డి లతో కలిసి ఉదయసముద్రం పనులను తనిఖీ చేశారు. ఉదయసముద్రం ప్రాజెక్టు సైటు దగ్గర ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.  
ప్రాజెక్టు ను పూర్తి చేసి  50 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని , 60 చెరువులను నింపాలని  మంత్రి  ఆదేశించారు.ఈ మేరకు ఆయా పనులకు 'టైమ్ లైను' విధించారు. టార్గెట్ ప్రకారం పనులు పూర్తి చేయడం లో విఫలమైతే సంబంధిత ఏజెన్సీని తొలగించి ప్రత్యామ్నాయంగా మరో ఏజెన్సీ కి పనులు కేటాయించాలని ఆదేశించారు. భూసేకరణ, పనుల పురోగతిని మంత్రి సమీక్షించి, అధికారులకు సూచనలు చేశారు.  
 

ఐఎఎస్ ల శిక్షణా కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నాయుడు
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్సోరి లోని అఖిల భారత సర్వీసుల సంస్థలో చంద్రబాబు ప్రసంగించారు. వివిధ రాష్టాలకు చెందిన ఐఏఎస్ లతో పాటు కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న ఐఏఎస్ లకు 3 వారాల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. శిక్షణలో ఉన్న ఐఏఎస్ లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పాలనా పరమైన సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం వివరించారు. పరిపాలనలో ఐపీఎస్ లు భాద్యతే అధికంగా ఉంటుందని, వారు ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవాలని వారికి సూచించారు.
 

టీఎంసీని వీడనున్న ఎంపి ముకుల్ రాయ్

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.  తృణమూల్ పార్టీని వీడనున్నట్లు సీనియర్ నాయకుడు. ఎంపి ముకుల్ రాయ్  ప్రకటించారు. త్వరలో టీఎంసి పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేస్తానని ఆయన ప్రకటించారు. దసరా ఉత్సవాల తర్వాత టీఎంసీని ఎందుకు వీడాల్సి వచ్చిందో చెబుతానని అన్నారు.
అయితే ఇటీవల బీజేపి నేతలతో సమావేశమైన ఆయన, ఈ నిర్ణయాన్ని ప్రకటించడంతో బీజేపిలో చేరడానికే ఈ రాజీనామా జరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
 

ఆర్టీఐ చీఫ్ కమీషనర్, కమీషనర్ ల ప్రమాణ స్వీకారం

అర్టీఐ ఛీఫ్ కమీషనర్ గా రాజ సదారాం, కమీషనర్ గా బుద్ద మురళిల చేత ఇవాళ గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సంధర్బంగా సదారాం మాట్లాడుతూ...తనపై నమ్మకం ఉంచి ఈ భాద్యతలు అప్పగించిన సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. చీఫ్ కమీషనర్ గా సామాన్యులకు సేవ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అలాగే అర్టీఐ కమీషనర్ బుద్ద మురళి మాట్లాడుతూ... ఈ సమాచార చట్టం పై అవగాహన కల్పించేందుకు విద్యార్థుల వద్దకు వెల్లి వారిని చైతన్యం చేసే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ చట్టం కేవలం కొంత మందికే పరిమితం కాదని, దీనిద్యారా సామాన్యల హక్కులను రక్షిస్తానని తెలిపారు. 

ఈ కార్యక్రమం అనంతరం ఆర్టీఐ కార్యాలయంలో వీరు భాద్యతలు స్వీకరించారు. 
 

లలితాదేవిగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ

నవరాత్రి ఉత్పవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఇవాళ లలితా దేవిగా భక్తులకు దర్శనమివ్వనుంది. అమ్మవారిని దర్శించుకోడానికి ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. దసరా సెలవులు కావడంతో భక్తులు అధికసంఖ్యలో విచ్చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
 

click me!