కాళేశ్వరం దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

First Published Sep 20, 2017, 11:02 AM IST
Highlights

విశేష వార్తలు

  • కాళేశ్వరం దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
  • బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ పై  చీటింగ్, క్రిమినల్ కేసు
  • పద్మభూషణ్ అవార్డుకు ధోనీ పేరును సిపార్సు చేసిన బిసిసిఐ 
  • ఏపి గ్రూప్ 2 నిమామకాలపై స్టే విధించిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 
  • అమరావతిలో మొదలైన కలెక్టర్ల సదస్సు, పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు

రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాడాలి

ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర లు కృష్ణా నదిపై చేనడుతున్న అక్రమ ప్రాజెక్ట్ లపై రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. అలాగే యోర్డు అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించడం సరికాదన్నారు. తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములవలే ప్రశాంత వాతావరణంలో నీటిని వాడుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే మంచిదని తుమ్మల సూచించారు.  
 

కాళేశ్వరం దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

కాళేశ్వరం పనుల్లో సొరంగం కుప్పకూలి ఏడుగురు కూలీలు మృతి చెందిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.నిన్ననే మంత్రి హరీష్ రావు సమీక్ష చేశారు, ఈ రోజే ఈ ఘటన జరగడం అంటే ఎంత నిర్లక్ష్యంగా పనులను సమీక్షించారో అర్థమవుతోందన్నారు. అందుకు మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేసి మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలన్నారు. అలాగే మృతి చెందిన కూలీల కుటుంబాలను అన్ని విధాలా ప్రభుత్వమే ఆదుకోవాలని,వెంటనే 10 లక్షల రూపాయల నష్ట పరిహారం అందించాలి పొన్నం డిమాండ్ చేశారు. అంతే కాకుండా గాయపడిన వారికి ప్రభుత్వం తరపున వైద్యానికయ్యే ఖర్చులు భరించాలని పొన్నం ప్రభుత్వాన్ని కోరారు.
 

మలక్ పేటలో చీరలు పంపిణీ చేసిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతకమ్మ పండగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం మంచి ఆలోచన అని ఉప ముఖ్యమంత్రి  మహమూద్ అలీ అన్నారు. ఆయన ఇవాళ మలక్ పెట్ నియోజకవర్గంలోని షోయబ్ పార్క్, మూసారంబాగ్ లోని సిరిపురం కమ్యూనిటీ హాల్ లో స్థానిక మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ  సందర్భంగా మహమూద్ అలీ  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అడపడుచుల కళ్ళలో ఆనందం నింపేందుకు రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపణి కార్యక్రమం చేపట్టాడని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకంపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం అలవాటైందని, వీరికి తెలంగాణ ఆడపడుచులే సమాదానం చెబుతారని హెచ్చరించారు.
 

బీసీల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళతా 

బీసీ సామాజిక వర్గం ప్రస్తుతం చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని,  త్వరలో డిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ చర్చించి ఈ సమస్యలను పరిష్కరిస్తానని  తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇవాళ  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బీసీ యువజన రాష్ట్ర మహాసభ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ... రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలను ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కతుందని ప్రశంసించారు. బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి బీసీలంతా అండగా ఉండాలన్నారు.  బీసీలంతా ఐక్యంగా ఉండి తమ సామాజిక వర్గాన్ని అభివృద్దిపర్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

బాలీవుడ్ భామపై చీటింగ్ కేసు

బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ పై  చీటింగ్, క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. వివరాల్లోకి వెళితే ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రదారి అండర్ వరల్డ్ డాన్  దావూద్ ఇబ్ర‌హీం సోద‌రి హ‌సీనా జీవిత నేప‌థ్యంలో హ‌సీనా పార్క‌ర్ అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన హసీనా పాత్రలో  శ్రద్ధాకపూర్ నటించింది. ఇందులో హీరోయిన్ డ్రెస్సులను ఏజేటీఎం సంస్థ సమకూర్చింది.
 ఒప్పందంలో భాగంగా ప్రమోషన్లలో తమ బ్రాండ్ దుస్తులే ధరించాలని హీరోయిన్ శ్రద్ధా, ప్రొడ్యూసర్లతో ఆ సంస్థ డీల్ కుదుర్చుకుంది.  కానీ, ఒప్పందంలో రాసుకున్న‌ట్లుగా శ్ర‌ద్ధా క‌పూర్ గానీ, సినిమా బృందం గానీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో త‌మ బ్రాండ్ కు ప్ర‌చారం క‌ల్పించ‌డం లేదంటూ ఆ సంస్థ వీరిపై క్రిమిన‌ల్ కేసు పెట్టింది

పద్మభూషణ్ అవార్డుకు ధోనీ పేరును సిపార్సు చేసిన బిసిసిఐ

పద్మ భూషణ్ అవార్డుకు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరును బిసిసిఐ కేంద్ర  ప్రభుత్వానికి సిపార్స్ చేసింది. ఇవాళ సమావేశమైన పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా ధోనీ పేరును  ఆమోదించారు. భారత క్రికెట్ కు ధోనీ అందిచిన సేవలకు, విజయాలకు గుర్తింపుగా ఆయనకు పద్మభూషణ్ అవార్డును అందించడం గౌరవంగా ఉంటుందని పేర్కొన్నారు. అతడి సారధ్యంలో టీం ఇండియా రెండు ప్రపంచకప్ లతో పాటు అనేక ట్రోఫీలను గెలిచిందని, వ్యక్తిగతంగానూ అతడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడని బిసిసిఐ కితాబిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ధోనీ పద్మభూషణ్ అవార్డును అందుకుంటారు.
 

తమిళనాడులో బల పరీక్షపై స్టే విధించిన మద్రాస్ హైకోర్టు

తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. పళనిస్వామి ప్రభుత్వానికి సంఖ్యా బలం లేదని, ప్రభుత్వాన్ని విశ్వాసపరీక్షకు ఆదేశించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన దినకరన్ వర్గ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. బల పరీక్షపై స్టే విధించిన న్యాయస్థానం, తదుపరి విచారణ వరకు బలపరీక్ష నిర్వహించవద్దని ఆదేశించింది. అలాగే 18 మంది ఎమ్మెల్యేల అనర్హతపై విచారించిన కోర్టు ఈ 18 నియోజకవర్గాల్లో ఎటువంటి ఉపఎన్నికలు నిర్వహించొద్దని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4 కు వాయిదా వేసింది. 
 

 గ్రూప్ 2 నిమామకాలపై స్టే విధించిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 
 

ఆంద్రప్రదేశ్ లో గ్రూప్ 2 నిమామకాలపై ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ స్టే విధించింది. అక్టోబర్ 9 వరకు ఎలాంటి నియామక ప్రక్రియ చేపట్ట వద్దని ఏపీ ప్రభుత్వానికి, నియామక సంస్థ ఏపిపిఎస్సి ని ట్రిబ్యునల్  ఆదేశించింది. ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ తో పాటు స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయని పలువురు నిరుద్యోగ బాదితుల ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ట్రిబ్యునల్ నిమామకాలపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

అమరావతిలో కలెక్టర్ల సదస్సు, పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు

ఆంద్రప్రదేశ్ రాజదాని అమరావతి లో కలెక్టర్ల సదస్సు మొదలయ్యింది. ఈ సదస్సుకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు పలువురు మంత్రులు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్,అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వంలోని సీనియర్ ఐఎఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...సంక్షేమ కార్యక్రమాల్లోను, పాలనాపరమైన అంశాల్లోను కలెక్టర్ల కు సర్వాధికారాలు ఇచ్చానని, అందుకే వారికి నేను ఏదీ చెప్పనవసరం లేదన్నారు. సీఎం తర్వాత కలెక్టర్ల కె ఎక్కువ అధికారాలుంటాయని, అందుకే వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఆ నిర్ణయాలు ప్రజా సంక్షేమానికి ఊతమిచ్చేలాగ ఉండాలని సూచించారు.
అలాగే తమ ప్రభుత్వ పాలనలో జాతీయ వృద్ది కంటే రాష్ట్ర వృద్ది రేటు బాగుందని తెలిపారు. అంతే కాకుండా  ప్రభుత్వ ప్రజాకర్షక పాలన పట్ల రాఫ్ట్రంలోని 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, దీన్ని ఇలాగే కొనసాగిద్దామని కలెక్టర్లకు చంద్రబాబు సూచించారు.
 

click me!