
తెలంగాణ లోని పేద ఆడపడుచులకు ఈ నెల 18,19 తేదీలలో ప్రభుత్వం తరపున బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇవాళ బతుకమ్మ పండగ ఏర్పాట్లపై ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28 న ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ సందర్బంగా 40 వేల మంది మహిళలతో బతుకమ్మ ఆడి, గత సంవత్సరం మనమే సృష్టించిన గిన్నిస్ రికార్డును బద్దలుకొట్టనున్నట్లు కవిత పేర్కొన్నారు. అందుకోసం తెలంగాణలోని ఆడపడుచులంతా ఈ మహా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబరు 9 నుంచి 15వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో వైదిక సమ్మేళనాలు జరుగనున్నాయి.
మొదట సెప్టెంబరు 9న విశాఖపట్నంలోని ద్వారకానగర్ శంకరమఠం లో ఈ సమ్మేళనం జరగనుంది.తర్వాత సెప్టెంబరు 11న హైదరాబాద్ లోని హిమాయత్ నగర్‌లో గల టిటిడి కల్యాణమండపం లో, సెప్టెంబరు 12న విజయవాడలోని టిటిడి కల్యాణమండపం, సెప్టెంబరు 15న కడపలోని టిటిడి కల్యాణ మండపంలో ఈ వైదిక సమ్మేళనాలు నిర్వహిస్తారు. ఈ సమ్మేళనంలో వేద విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉపకులపతి, తిరుపతి జెఈవో పోల భాస్కర్, రిజిస్ట్రార్ విశ్వనాథ, కో-ఆర్డినేటర్ బ్రహ్మాచార్యులు పాల్గొంటారు.
ఇవాళ కర్ణాటకలో తెలుగు వారిపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ఖండించారు. కర్ణాటకలో ఆంధ్రులపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. భవిష్యత్ లో ఇలాంటి దాడులను నిలువరించేందుకు కేంద్రప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. జాతీయ స్ధాయి పోటీ పరీక్షల కేంద్రాలను విశాఖపట్నం, విజయవాడల్లో ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రాంత విద్యార్థులు ప్రతిభ ఆధారంగా ఎంపిక అవుతుంటే కన్నడ సంఘాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
శంషాబాద్ లో జరుగుతున్న కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో టీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమటిరెడ్డి బ్రదర్స్ మద్య తీవ్ర మాటల యుద్దం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన కొమటిరెడ్డి వర్గీయులు ఉత్తమ్ కు చెప్పులు చూపిస్తూ దూషనలకు దిగారు. దీన్ని చూసి చూడనట్లు వ్యవహరించిన కొమటిరెడ్డి సోదరులు. కార్యక్రమం మద్యలోంచే వెళ్లిపోయారు. .
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముప్తి తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని శాంతి భద్రతలపై చర్చించారు. శాంతిని నెలకొల్పే విషయంలో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, కేంద్ర బలగాల పనితీరుపై వారు చర్చించుకున్నట్లు సమాచారం.
తెలంగాణ రచయిత కాళోజి నారాయణరావు 103 వ పుట్టినరోజును పురస్కరించుకొని నల్గొండ జిల్లాలోని తెలంగాణ విద్యావంతుల వేదిక కార్యాలయంలో కాళోజి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు మాట్లాడుతూ... నిజాం పాలనను,పెద్దమనుషుల ఎత్తుగడులను,ఇందిరాగాంధీ,మర్రి చెన్నారెడ్డి,కాసు బ్రహ్మనంధరెడ్డి,వెంగల రావుల బడా నేతలను సైతం బజారులో నిలబెట్టి, వారి అన్యాయాని ఎండగట్టిన దైర్యశాలి కాళోజి గారని ప్రశంసించారు.
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మాత్రం కాళోజి ఆశయాలకు తూట్లుపొడిచి దళితులపై థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తూ, అడుగడుగున హక్కులను ఉల్లంఘిస్తూ పాలన చేస్తున్నారని అన్నారు. ఇలాంటి నియంతృత్వ పాలకులను పాతరేయడానికి కాళోజి అందించిన స్పూర్తి తో ప్రజాస్వామిక తెలంగాణ కై ముంధుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ జయంతి కార్యక్రమంలో టివివి జిల్లా కోశాదికారి బి.కేశవులు,జిల్లా సహాయ కార్యదర్శి వి.కొండల్,నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి యన్.వెంకన్న,టిజేఏసి నియోజక వర్గ కన్వినర్ గద్దపాటి సురేంధర్ , డివిజన్ నాయకులు ఎ.మురళి,పి.గిరి,అశోక్ ,నవీన్ ,మనోజ్,నర్సింహ్మ చారి,మురళి,చందు తదితరులు పాల్గొన్నారు.
కాళోజీ తాత
కాళోజీ తాత !
నాకు నచ్చినోడు
జనం మెచ్చినోడు
నా రాతలకు కారణమైనోడు
నా తూటాలకు ట్రిగ్గరసోంటోడు
నా ఆలోచనలకు మార్గదర్శైనోడు
నా రేపటి కాలానికి ఆదర్శమైనోడు
కడదాకా అన్యాయాన్ని ఎదురించినోడు
ప్రజా సమస్యలే ' నా గొడవ ' అనేటోడు
' నా ' నుండి ' మా ' కు తేడా చెప్పినోడు
ఈ గడ్డ మీద పుట్టకున్న దీని ఋణం తీర్సుకున్నోడు
ఓరుగల్లుల ఎదిగినోడు
తెలంగాణంతట తిరిగినోడు
నిజాం రాజు మీద అక్షరాల తూటాలు వదిలినోడు
మళ్ళ పుట్టడు ఈనె అసోంటోడు
" పుట్టుకా నీదే
చావూ నీదే
బతుకంతా తెలంగాణాదే..... "
ప్రజాకవి కాళోజి జయంతి శుభాకాంక్షలు
- దీక్షీత్ రొడ్డ ,
గోదావరిఖని .
తెలంగాణ ప్రభుత్వాన్ని నూతన సచివాలయం నిర్మించకుండా నిలుపుదల చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టు లో ఫిల్ దాఖలైంది. కేంద్ర రక్షణ శాఖకు చెందిన బైసన్ పోలో గ్రౌండ్ ను సచివాలయ నిర్మాణం కోసం ఇవ్వడాన్ని తప్పుబట్టిన మాజీ డీజీపి భాస్కరరావు తో పాటు మాజీ క్రికెటర్ జయసింహా లు ఈ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. దీనిపై హై కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.
ఇటీవల తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించిన స్కోచ్ సంస్థ ఇవాళ ఆయనకు అవార్డును అందించింది. ఢిల్లీ లో జరిగిన 49 వ స్కోచ్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ అవార్డును అందుకున్నారు. తెలంగాణలో ఐటీ అభివృద్దికి ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందింస్తున్నట్లు స్కోచ్ సంస్థ సభ్యులు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ఎక్సిబిషన్ లో తెలంగాణ ఐటీ స్టాల్స్ ను కేటీఆర్ సందర్శించారు.
అమర వీరుల స్పూర్తియాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్న టీ జేఏసి చైర్మన్ కోదండరామ్ 5 వ విడత యాత్రను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టనున్నారు. ఈ రోజు ప్రారంభం కావాల్సిన యాత్రను పోలీసులు మార్గమద్యలోనే అడ్డుకుంటారన్న సమాచారం వుండటంతో, ఆయన నిన్న రాత్రే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు పలువురు కీలక జేఏసి నాయకులు కూడా రహస్యంగా ఆదిలాబాద్ కు బయల్దేరారు.