దేశ ద్రోహం కేసులో అఖిల్ గొగోయ్ అరెస్ట్

First Published Sep 26, 2017, 11:27 AM IST
Highlights

విశేష వార్తలు

  • దేశద్రోహం కేసులో రైతు హక్కుల  పోరాటయోధుడు అఖిల్ గొగోయ్ పై అరెస్ట్
  • ఒంగోలులో యువతిపై అత్యాచారయత్నం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్
  • ఏపీ కేడర్ ఐపిఎస్ అధికారి రత్నకుమారి కుమారుడు రోషన్‌ అనుమానాస్పద మృతి ​
  • విదేశాల్లో రిటైర్మెంట్ వేడుకను ఫ్లాన్ చేసిన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘు ​
  • నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ ఇంటి పై ఏసిబి దాడులు
  • నాచారం లో వివాహితపై పూజారి అత్యాచారయత్నం

అవినీతి అధికారి రఘుకు 14 రోజుల రిమాండ్

విశాఖ పట్నం :ఏపి టౌన్ ప్లానింగ్ సంచాలకులు రఘును ఏసిబి అధికారులు ఏసిబి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసును విచారించిన కోర్టు నిందితుడికి వచ్చే నెల 9 వరకు రిమాండ్ విధించింది. అయితే ఈ కేసుకు సంభందించి కీలక సమాచారాలు రాబట్టాల్సి ఉన్నందున నిందితుడు రఘును తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో ఏసిబి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 
 

దేశ ద్రోహం కేసులో అఖిల్ గొగోయ్ అరెస్ట్

దేశ ద్రోహం కేసులో రైతు హక్కుల కోసం పోరాడుతున్న అఖిల్ గొగోయ్ ను అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ భద్రత చట్టం కింద అతన్ని అరెస్ట్ చేసినట్లు అసోం పోలీసులు తెలిపారు. బీజేపిపై యుద్దానికి ఆయుధాలు ఎక్కుపెట్టండి అని ఓ ర్యాలీలో ఈయన రైతులకు పిలుపునిచ్చారు. దీంతో ఆయనపై బీజేపి కార్యకర్తల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఈ కేసులో భాగంగా ఇవాళ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

అటవీ అధికారిపై కలప స్మగ్లర్ల దాడి

జయశంకర్ భూపాలనల్లి జిల్లాలో అటవీశాఖ అధికారిపై కలపను అక్రమంగా తరలిస్తున్న ముఠా దాడికి పాల్పడింది.వివరాల్లోకి వెళితే జిల్లాలోని వెంకటాపురం మండలం గుర్రంపేట అటవీ ప్రాంతంలో అక్రమంగా కలపను స్మగ్లింగ్ చేస్తున్నవాహనాలను అటవీశాఖకు చెందిన డిప్యూటీ రేంజర్ అడ్డుకున్నాడు. దీంతో రెచ్చిపోయిన స్మగ్లర్లు అతడిని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో అతడు వెంకటాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

వాగులో పడి బాలుడు అతడి పిన్ని మృతి

గుంటూరు జిల్లా గురజాల సమీపంలోని రెంటచింత గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.  వాగులో పడి మునిగిపోతున్న అక్క కొడుకును కాపాడబోయి ఓ యువతి కూడా ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే నీలం రోజా అనే యువతి తన అక్క కొడుకు బన్ని ని వెంటపెట్టుకుని బంధువుల ఇంటికి వెళ్లింది. దసరా సెలవులు కావడంతో అందరు కలిసి సరదాగ బయటికి వెళ్లగా, ప్రమాదవశాత్తు బాలుడు వాగులో పడ్డాడు. దీంతో  బాలుడిని కాపాడటానికి యువతి కూడా వాగులోకి దిగడంతో ఇద్దరూ మృత్యవాత పడ్డారు.
 

ఒంగోలులో యువతిపై అత్యాచారయత్నం

ఒంగోలు జిల్లాలోని కనిగిరిలో ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడి, ఆ దృష్యాలను మొబైల్ ఫోన్ లో చిత్రీకరించిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిపై అత్యాచారానికి ప్రయత్నిస్తూ తీసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. యువతి పై బలత్కారానికి ప్రయత్నించిన నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. 
 

ఎస్పీ రత్నకుమారి కుమారుడు రోషన్‌ అనుమానాస్పద మృతి 

హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ ఐపీఎస్‌ క్వార్టర్స్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడే నివాసముంటున్న ఎస్పీ రత్నకుమారి కుమారుడు రోషన్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రోషన్‌ మృతి చెందిసట్లు వారి డ్రైవర్ అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సమయంలో  రత్నకుమారి మంగళగిరి లో ఉండటం, కుటుంబసభ్యులెవరూ ఇంట్లో లేకపోవడంతో ఈ ఘటన  ఆలస్యంగా వెలుగుచూసింది. 
మెడిసిన్ మూడవ సంవత్సరం చదువుతున్న రోషన్  చదువును మద్యలో ఆపేసి  మానసికంగా భాదపడుతున్నాడని పోలీసులు తెలిపారు.   డ్రిపెషన్‌ వల్లే రోషన్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

రిటైర్మెంట్ ను రిచ్‌గా ఫ్లాన్ చేసిన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘు 
 

ఏసిబి దాడుల్లో భారీ అక్రమాస్తులతో పట్టుబడిన ఎపి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకట రఘు కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇంకో నాలుగు రోజుల్లో పదవీ విరమణ పొందనున్న అతడు, ఈ పదవి విరమణ ఫంక్షన్  గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు సమాచారం. విదేశాల్లో సన్నిహితుల సమక్షంలో ఈ పంక్షన్ ను అట్టహసంగా చేసుకోడానికి ఏర్పాట్లు చేశాడు. అందుకోసం సింగపూర్  మలేషియా, హాంకాంగ్ లకు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఉంచాడు. ఐతే ఇంతలోనే ఎసిబి దాడుల్లో అక్రమాస్తులు బయటపడి అతడి ప్లాన్ తలకిందులయింది.
 

వివాహితపై పూజారి అత్యాచారయత్నం

నాచారంలోని హెచ్ఎంటీ నగర్ కాలనీలో  పూజల పేరుతో ఓ వివాహాతపై పురోహితుడు అత్యాచారానికి ప్రయత్నించాడు.ఇంట్లో పూజ చేయడానికి వచ్చిన పూజారి కుటుంబ సబ్యులందరిని ఇంటి బయట ఉండమని చెప్పి ఓ మహిళను మాత్రం తనతో పాటు పూజలో పాల్గొనాలని చెప్పాడు. ఇదంతా పూజలో భాగయని నమ్మిన కుటుంభసబ్యుల అలాగే వివాహిత మహిళను ఇంట్లోకి పంపించారు. ఇదే అదునుగా భావించిన పూరోహితుడు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన మహిళ కేకలు వేయడంతో కుటుంబసభ్యులు ఇంట్లోకి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని మహిళ భర్తకు తెలపడంతో పురోహితుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. 
 

ఏసిబి వలలో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్

నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ ఇంటి పై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. నిజామాబాద్ లోని కార్యాలయంతో పాటు, హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మరియు భందువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.  
 ఈ దాడుల్లో భారీగా అక్రమాస్తులు కల్గి ఉన్నాడని అధికారులు గుర్తించారు. జహీరాబాద్ లో 30 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు, రంగారెడ్డి జిల్లాలో ప్లాట్లు, కిలో బంగారు నగలను అధికారులు గుర్తించారు. ఇంకా దాడులు కొనసాగుతున్నందున ఆస్తులకు సంభందించిన వివరాలు తెలియాల్సి ఉంది.
 

 

click me!