ఈ మందుబాబు మహానటుడు (వీడియో)

First Published Sep 18, 2017, 11:01 AM IST
Highlights

విశేష వార్తలు

  • కామారెడ్డి జిల్లాలో హోం గార్డ్ ఆత్మహత్య
  • నూజీవీడు ట్రిపుల్ ఐటీ లో ర్యాగింగ్ కు పాల్పడిన  సీనియర్ విద్యార్థులపై వేటు
  • సూర్యాపేట జిల్లాలో ఆరుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య
  • ఎల్బీనగర్ లో వివాహిత అనుమానాస్పద మృతి
  • ఆళ్లగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం,ముగ్గురి మృతి

ఈ మందుబాబు మహానటుడు (వీడియో) 

 

ఎల్బినగర్ ; సాగర్ రింగ్ రోడ్డు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ లో ట్రాఫిక్ పోలీస్ ల కి చుక్కలు చూపించిన తాగుబోతు....బ్రీత్ అనలైసెర్ తో టెస్ట్ చేస్తుండగా నాకు గుండెపోటు వస్తుందని నటిస్తూ రోడ్ పై పడుకుని పోలీస్ లను ఇబ్బందులకి గురిచేసిన తాగుబోతు.....
 

బతుకమ్మ చీరలను తగలబెట్టిన వారిపై కేసులు

యాదాద్రి భువనగిరి: ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చీరలను తగులబెట్టినందుకు 13 మంది బీజేపీ, కాంగ్రెస్ నేతలపై భువనగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధులకు ఆటంకం కలిగించినందుకు సెక్షన్ 357 కింద కేసు నమోదు చేస్తున్నట్లు  పోలీసులు తెలిపారు. 
 

చత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంట‌ర్, ఇద్దరు మావోయిస్టుల మృతి

చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని రసన్‌తంగ్ ఏరియాలో  పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి 12 బోర్ గన్, 13 డిటోనేటర్లు, రేడియో సెట్, కోడెక్స్ వైర్, వైర్‌లెస్ సెట్, సోలార్ ప్లేట్స్‌తో పాటు విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిక్కడపల్లి లో చైన్ స్నాచింగ్

హైద్రాబాద్ : చిక్కడపల్లి లేబర్ కమిషనర్ కార్యాలయం సమీపంలో  చైన్ స్నాచింగ్ జరిగింది. బైక్ పై వచ్చిన దొంగలు ఓ మహిళ మెడలోంచి 4 తులాల బంగారు గొలుసును లాక్కుని వెళ్లారు. దీంతో ఆ  మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న చిక్కడ్ పల్లి పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం 

తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తిరుపతి నుంచి ఇనుప సామాగ్రిని లారీలో తిరుమలకు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. లారీలోని ఎత్తైన ఇనుప కమ్మీలు ఘాట్ రోడ్డులోని చెట్లకు తగిలి కొమ్మలు విరిగిపడ్డాయి. అదే సమయంలో లారీ వెనక వస్తున్న కారు, బైకు పై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఎమ్మెల్యే బాారినుండి రక్షించమంటూ హెచ్చార్సీని ఆశ్రయించిన బాధితుడు (వీడియో)

తన భూములను లాగేసుకోవడానికి అధికార పార్టీ ఎమ్మెల్యే పోలీసులతో కలిసి వేదింపులకు గురిచేస్తున్నారంటు  మియపూర్ కు చెందిన 90 ఏళ్ళ వృద్దుడు కొమరయ్య ఆరోపించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ, సి.ఐ. హరిష్ రెడ్డిల నుండి తనకు ప్రాణ హని వుందంటూ అతడు ఇవాళ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసాడు. మియాపూర్ లోని భూమి వివాదంలో రాజీ పడటం లేదని తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా మియాపూర్ పోలీసులు నెల రోజుల్లో 9 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.   వీరి నుండి తనను, తన కుటుంబసభ్యులను  రక్షించాలని హెచ్చార్సీని వేడుకున్నాడు.

పాతాళగంగలో దూకి తల్లీ పిల్లల ఆత్మహత్య 

నాగర్ కర్నూలు జిల్లా అమ్రబాదు మండలం ఈగలపెంట పాతాళగంగ వద్ద కృష్ణానదిలోకి దూకి ఓ మహిళ ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. అయితే ఇంకా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
 

ఉద్యోగం పర్మనెంట్ కాలేదని హోంగార్డ్ ఆత్మహత్య

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ తమ బతుకులు ఏ మాత్రం మారలేదని సూసైడ్ నోట్ లో రాసి ఓ హోం గార్డ్ ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా బికనూర్ పోలిస్ స్టేషన్లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న శివ అనే హోంగార్డు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ ఉద్యోగాలు పర్మనెంట్ కాకపోవడం,జీతాలు పెరగక ఇబ్బందులకు గురై  ఆత్మహత్య పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులుసూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని పోస్టమర్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.
 

నూజివీడు ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై వేటు

నూజివీడు ట్రిపుల్ ఐటీ లో ర్యాగింగ్ కు పాల్పడిన  15 మంది సీనియర్ విద్యార్థులు సంవత్సరం పాటు నిషేదానికి గురయ్యారు. అలాగే మరో ఆరుగురిపై శాశ్వత నిషేదాన్ని విధిస్తూ  ట్రిపుల్ ఐటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా జూనియర్లపై 54 మంది సీనియర్లు ర్యాగింగ్ పేరుతో దాడికి దిగినట్లు అధికారులు గుర్తించారు. వీరిపై కేటగిరీ వారీగా  చర్యలు తీసుకున్నట్లు ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండి ఉండేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అప్పుల బాధతో ఆరుగురు కుటుంబసభ్యుల ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన 6 గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన సూర్యాపేట మామిళ్లగడ్డ లో జోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పురుషులు,ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
వివరాల్లోకి వెళితే మామిళ్లగడ్డకు చెందిన కస్తూరి జనార్దన్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి. ఈయనకు ఇద్దరు కుమారులున్నారు. ఐతే పేద్ద కొడుకు సురేష్ కంప్యూటర్ల వ్యాపారం చేసేవాడు.వ్యాపారంలో నష్టం రావడంతో, అప్పుల వాళ్లు ఇబ్బంది పెడుతుండటంతో,వారం రోజుల నుండి సురేష్ కనపడకుండా వెళ్ళాడు.
కొడుకు కనపడక పోవడం,అప్పుల వాళ్ళు ఇంటికి వస్తుండటంతో మనస్తాపానికి గురైన కుటుంబ సభ్యులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.మృతుల్లో కస్తూరి జనార్ద(55),చంద్రకళ(50), అశోక్(25), ప్రభాత(30)(సురేష్ భార్య), సిరి(5), రిత్విక(2) లు ఉన్నారు.
 

రోడ్డుప్రమాదంలో తల్లీ కొడుకుల సజీవదహనం

 
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బత్తలూరు గ్రామం దగ్గర కర్నూలు - కడప జాతీయ రహదారిపై మట్టి కుప్పను ఢీకొని కారు బోల్తా పడి, మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో వనితాబాయి అనే మహిళతో పాటు ఆమె కుమారులు ప్రేమ్ కుమార్ (5), ఉమేశ్ (2)  లు మంటల్లో ఆహుతయ్యారు. అయితే వనితాబాయి భర్త రాజా ప్రసాద్ కు తీవ్ర గాయాలవగా నంద్యాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా  ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వెళ్తుండగా ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.
 

ఎల్బీనగర్ లో వివాహిత అనుమానాస్పద మృతి

ఎల్బీ నగర్ లోని రాక్ టౌన్ కాలని లో దారుణం జరిగింది. కాలనీలో నివాసముండే హారిక అనే వివాహిత అనుమానాస్పద  స్థితి లో మృతి చెందింది. అయితే భర్త రిషి కుమార్  హారికను కొట్టి, కాల్చి హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా వేలేరుకు చెందిన  హారికకు మేనబావ రిషి కుమార్ తో రెండు సంవత్సరాల క్రితం వివాహం అయింది. అయితే గత కొంత కాలం గా ఇద్దరి మధ్య తగాదాలు జరుగుతున్నాయి. దీంతో రుషి  సైకో గా  ప్రవర్తిస్తూ హారికను శారీరకంగా వేదిస్తున్నాడు. ఈ ఆవేశంలోనే హారికను చంపి ఉంటాడని  ఆమె అన్నయ్య రాంకుమార్ ఆరోపిస్తున్నారు.
 స్థానిక  పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అనుమానాస్పద  మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!