లక్నోలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాట’

Published : Aug 03, 2017, 12:58 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
లక్నోలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాట’

సారాంశం

ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తుంది. లోను కింద టమాటాలను అందజేయడం విశేషం

 

స్టేట్ బ్యాంక్ ఆప్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి విన్నాం.. మరి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాట ఏంటబ్బా.. ఎప్పడూ వినలేదే అనుకుంటున్నారా.. దీనిని కాంగ్రెస్ నేతలు ప్రవేశపెట్టారు. వివరాల్లోకి వెళితే..

 

టమాట ధర ఆకాశాన్ని అంటుతోంది. మధ్యతరగతి కుటుంబీకులు టమాట కొనాలంటేనే భయపడాల్సి వస్తోంది. మరో వైపు సరైన వర్షపాతం లేక టమాట పంట రైతులు నష్టపోతున్నారు. ఎన్ని జరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం  ఈ విషయంలో మిన్నుకుండిపోతోందే తప్ప.. ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం.. లక్నోలో పలువురు కాంగ్రెస్ నేతలు ‘ స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాటా’ కి తెర లేపారు.

ప్రభుత్వంపై కొపంతో వీరు వినూత్నంగా ఆందోళన చెపట్టారు. ఈ బ్యాంకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తుంది. ఈ బ్యాంకులో లోను కింద టమాటాలను అందజేయడం విశేషం. దీంతో వీటిని కొనడానికి స్థానికులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు.. ఈ బ్యాంకులో టమాటాలు డిపాజిట్ చేస్తే.. ఆరు నెలల్లో దానికి రెట్టింపు పొందే అవకాశం ఉంది.

తాను ఈ బ్యాంకులో అర కేజీ టమాటాలు డిపాజిట్ చేశానని.. అది ఆరు నెలల్లో కేజీ టమాట అవుతుందని  శ్రీ కృష్ణ వర్మ అనే 103 ఏళ్ల వృద్ధుడు తెలిపారు. ఎవరైతే  ప్రస్తుత మార్కెట్ లో టమాటాలు కొనలేని స్థితిలో ఉన్నారో... వారికి  టమాటాలు  లోన్ ద్వారా అందజేస్తున్నామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)