
జియో సూనామి ఇంకా తీరం దాటలేదు. తొమ్మిది నెలల క్రిత్రం మొదలైన జియో వేట ఇంకా కొనసాగుతుంది. టెలికాం రంగంలోనే సంచలనం సృష్టించిన జియో 4జీ సిమ్ కార్డ్. ఇండియన్ టెలికాం రంగాన్ని షేక్ చేసింది. అప్పటి వరకు టెలికాం రంగంలో పెద్దన్నగా ఉన్న ఎయిర్‌టెల్‌కి భారీ షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఎయిర్‌టెల్ ఇచ్చిందే టారీప్ గా ఉన్న సమయంలో జియో ఇచ్చిన షాక్‌కి ఇప్పటికి కోలుకొలేకపోతుంది.
ప్రతి త్రైమాసికంలో ఎయిర్‌టెల్ కి 550 కోట్ల నష్టం.
జియో ఆరంభం అయిన నాటి నుండి అత్యధిక యూజర్లు ఉన్న ఎయిర్‌టెల్ నుండి జియోకి మారడంతో భారీగా నష్టాల బాటన ప్రయాణిస్తుంది. ప్రతి మూడు నెలలకు 550 కోట్ల పైగా ఎయిర్‌టెల్ నష్టపోతుంది. జియో కాల్స్ కి ప్రతి నిమిషానికి కి 21 పైసా ఎయిర్ టెల్ నష్టపోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు దాదాపుగా రూ 2000 కోట్లకు పైగా జియో కారణంగా ఎయిర్ టెల్ నష్టపోయిందని తెలిపింది.
మరో సారీ భారీ ఆఫర్‌తో ముందుకొచ్చిన జియో
జియో ఇప్పటి వరకు కేవలం టెలికాం రంగంలోనే ఉంది. నేటి నుండి జియో మోబైల్ రంగంలోకి కూడా ప్రవేసించింది. కేవలం సెక్యూరిటి డిపాజిట్ గా రూ 1500 తీసుకొని 4జీ ఫోన్ దేశ ప్రజలకు అందించనుంది. అందులో 153 రూపాయలతో నెలంతా ఫ్రీ డేటా, కాల్సింగ్ సౌకర్యాన్ని అందిస్తొంది. దీంతో మోబైల్ రంగంలో కూడా పెను సంచలనానికి తెరతీసింది.