
ఇండియా పాక్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ఇది తరతరాలుగా వస్తున్న శత్రుత్వం. అయితే శుక్రవారం గుజరాత్ లో పాకిస్తాన్ పౌరులకు ఇండియా పౌరసత్వం ఇచ్చింది. గతంలో కూడా పాక్ ప్రజలకు ఎదైనా ఆరోగ్య సమస్యలతో భారతదేశానికి దరఖాస్తు చేస్తే తక్షణమే ఆదుకునేది.
అయితే ఇండియన్ గవర్నమెంట్ చాలా మంది పాకిస్తానీయులకు భారత పౌరసత్వం ఇచ్చింది. ఒకరిద్దరికి కాదు ఏకంగా 114 మందికి ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీరు పాక్ నుండి వలస వచ్చి 16 సంవత్సరాలుగా గుజరాత్‌లో నివాసం ఉంటున్నారు. గత సంవత్సరం ఇండియా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. నేడు కేంద్రం ఆదేశాల మేరకు గుజరాత్ లోని అహ్మదాబాద్ కలెక్టర్ ఆఫీస్‌లో వారికి భారతీయ పౌరసత్వం లభించింది. 16 సంవత్సరాల క్రితం పాక్ లో జరిగిన ఉగ్రదాడులకు భయపడి ఇండియాకు వచ్చారు. ఇక్కడ భారత పౌరసత్వం లభించడంతో వారి సంతోషానికి హాద్దు లేకుండా పోయింది.
భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం, విదేశీయుల భారతదేశంలో పౌరసత్వం దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే ఇండియా పౌరసత్వం కోసం బంగ్లాదేశీయులు, పాకిస్తానీయులు, ఆఫ్ఘానిస్తాన్ దేశానికి చెందిన 216 మంది దరఖాస్తు చేశారు. తరువాతి దశలో వారి పౌరసత్వంపై అక్కడి అధికారులు నిర్ణయం తీసుకొనున్నారు.