వయసు తేడా ఎక్కువైతే కష్టమే..!

First Published Aug 4, 2017, 1:10 PM IST
Highlights
  • భార్య భర్తల మధ్య వయసు తారతమ్యంగా ఎక్కువగా ఉండ కూడదట
  • దాంపత్య జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేరట

 

ఇద్దరు వ్యక్తులను పెళ్లి తో ఏకం చేసేటప్పుడు.. కచ్చితంగా ఈడు-జోడు  చూడాలని పెద్దలు అంటారు. అదే నిజమని నిపుణులు కూడా చెబుతున్నారు. భార్య భర్తల మధ్య వయసు తారతమ్యంగా ఎక్కువగా ఉండ కూడదట. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నవాళ్లు తమ దాంపత్య జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేరట. పెళ్లి జరిగిన తొలి నాళ్లలో సెక్స్ పరంగా సంతృప్తికరంగానే ఉన్నా.. పది సంవత్సరాల తర్వాతా దానిపై ఆసక్తి తగ్గిపోతుందట. అదే దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ లేకపోతే.. వారు తమ దాంపత్య జీవితాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారట. తమ పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని కొలరాడో బౌల్డర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ టెర్రా తెలిపారు.

ఏజ్ తేడా ఉన్నవారిలో ఆలోచనా విధానం కూడా ఒకేలా ఉండదట. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు తట్టకునే శక్తి కూడా వారిలో తక్కువగా ఉంటుందట. ఏజ్ గ్యాప్ ఎక్కవగా లేని వారి ఆలోచన, వారి నిర్ణయాలు దాదాపు ఒకేలా ఉంటాయట.  ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి కూడా వీరిలో ఎక్కువగా ఉంటుందని టెర్రా చెప్పారు. దీనిపై దాదాపు 13 సంవత్సరాల పాటు పరిశోధనలు చేశారట.

click me!