మూడ‌వ రోజు ప‌ది వికెట్లు ప‌డ‌గొట్టారు

Published : Aug 05, 2017, 06:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
మూడ‌వ రోజు ప‌ది వికెట్లు ప‌డ‌గొట్టారు

సారాంశం

మూడవ రోజు ఆట ముగిసింది. మొదటి ఇన్నింగ్స్ లో లంక అలౌట్. రెండవ ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయిన లంక.


కొలంబోలో భారత్ తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో మూడో రోజు ఆట ముగిసింది. మూడవ రోజు భారత్ కి 10 వికెట్లు దక్కాయి. భారత బౌలర్లు రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులు వెనకబడన లంక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయింది.

అంతకుముందు 50/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 183 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లలో వికెట్ కీపర్ నిరోషన్ డిక్‌వెల్లా చేసిన 51 పరుగులే అత్యధికం. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా, షమీ, జడేజా చెరో రెండు వికెట్లు నేల కూల్చారు. ఉమేశ్ యాదవ్ ఓ వికెట్ తీశాడు.

  మూడో రోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 209/2 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు 183 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులు చేసి ఆధిక్యంలో ఉంది. ఫాలో ఆన్ ఆడుతూ లంక‌ జట్టు ఇంకా 230 పరుగుల వెనుకంజలో ఉంది. ఆట ముగిసే స‌మ‌యానికి 209 పరుగులు చేసింది. కరుణ రత్నే (92), పుష్ప కుమార (2) క్రీజులో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)