చానాళ్లకి పార్లమెంట్ గడప తొక్కారు..

First Published Aug 5, 2017, 4:25 PM IST
Highlights
  • ఓటు హక్కను వినియోగించుకున్న రేఖ, సచిన్
  • ఎన్నికలు కాబట్టే పార్లమెంట్ లో అడుగుపెట్టిన సచిన్, రేఖ

 

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ నటి రేఖలు చాలా రోజుల తర్వాత పార్లమెంట్ గడప తొక్కారు. పార్లమెంట్ హాల్‌లో  శనివారం ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్  జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు,రాజ్యసభ సభ్యులు సచిన్ టెండూల్కర్, రేఖ, లోక్‌సభ ఎంపీలు హేమమాలిని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాగా.. రాజ్యసభ్యులుగా సచిన్, రేఖలు బాధ్యతలు చేపట్టి.. 5 సంవత్సరాలు కావస్తోంది. ఈ 5 సంవత్సరాల కాలంలో వీళ్లు ఏనాడు పార్లమెంట్ కి హాజరు కాలేదు. అడపా దడపా వచ్చిన రోజుల్లో కూడా ఏ విషయం గురించీ మాట్లాడిందీ లేదు. పార్లమెంటు సమావేశాలకు కూడా రాని వాళ్లకు ఎంపీ పదవులు ఇవ్వడం  ఎంత మేరకు అవసరమో ఒకసారి ప్రభుత్వమే ఆలోచించుకోవాలిల. సమావేశాలకు రాకుండా ప్రజల గురించి ఆలోచించకుండా ఇంట్లో గడిపే వారికి, విదేశాల్లో పర్యటించే వారికి జీతాలు ఇవ్వడం ఎంత వరకు సమంజసం. దీని వల్ల ప్రజా ధనం వృధా అవుతోంది.ఈ 5ఏళ్లలో పార్లమెంటుకి రేఖ సుమారు 24 రోజులు హాజరు కాగా.. సచిన్ సుమారు 16 రోజులు హాజరయ్యాడు. ఈ శనివారం కూడా ఉపరాష్ట్ర పతి ఎన్నికలు కాబట్టి  వారు పార్లమెంట్ లో  అడుగుపెట్టారు.లేకపోతే వచ్చేవారు కాదు అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ కారణంగా వచ్చిన వీళ్లు.. మళ్లీ పార్లమెంట్ లో అడుగుపెట్టాలంటే  ఏదో ఒక విశేషం ఉండాల్సిందేనేమో.

 పార్లమెంట్ సమావేశాలకు సక్రమంగా హాజరు కాని సచిన్.. ఓటు హక్కును మాత్రం అందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం. అనంతరం హేమమాలిని మాట్లాడుతూ.. వెంకయ్యనాయుడిని ప్రతి ఒక్కరూ అభిమానిస్తారని తెలిపారు. పార్లమెంట్ సభ్యులందరికీ వెంకయ్య తెలుసు. వెంకయ్య రాజకీయ సమర్థుడు అని పేర్కొన్నారు.

click me!