టాయిలెట్ సీటు కంటే వాటర్ బాటిల్ పైనే ఎక్కువ బ్యాక్టీరియా.. దీనివల్ల ఎలాంటి రోగాలొస్తాయో తెలుసా?

Published : Mar 17, 2023, 01:43 PM IST
 టాయిలెట్ సీటు కంటే వాటర్ బాటిల్ పైనే ఎక్కువ బ్యాక్టీరియా.. దీనివల్ల ఎలాంటి రోగాలొస్తాయో తెలుసా?

సారాంశం

టాయిలెట్ సీట్ల కంటే వాటర్ బాటిల్స్ లోనే 40 వేల రెట్ల ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. ఈ బ్యాక్టీరియా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.   


కరోనా మహమ్మారి వల్ల జనాలకు పరిశుభ్రత ప్రాముఖ్యత తెలిసొచ్చింది. చేతులను శానీటైజ్ చేయడం , ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వంటి చిట్కాలను పాటిస్తున్నారు. ఈ అలవాట్ల వల్ల హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ నుంచి మనల్ని కాపాడుకోగలుగుతాం. ఎంత పరిశుభ్రంగా ఉన్నప్పటికీ.. ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశం మాత్రం ఉందంటున్నారు నిపుణులు. ఎలాగంటే.. 

తాజా పరిశోధన ప్రకారం.. టాయిలెట్ సీటు కంటే బాటిల్ పై 40 వేల రెట్ల ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మనల్ని ఎన్నో రోగాల బారిన పడేసే అవకాశం ఉంది. అమెరికాకు చెందిన వాటర్ ప్యూరిఫైయర్ అండ్ ట్రీట్మెంట్ కంపెనీ ఫిల్టర్ గురు ఇటీవల పలు గృహోపకరణాలపై పరిశోధనలు చేసింది. వాటర్ బాటిల్ పై టాయిలెట్ సీటు కంటే 40 వేల రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా ఉందని ఈ పరిశోధనలో నిరూపించారు.

ఈ పరిశోధనలో పునర్వినియోగ బాటిల్ అన్ని భాగాలను మూడుసార్లు పరిశీలించారు. దీని ప్రకారం.. బాటిల్ మూత, బాటిల్ నోటి భాగంపైనే ఎక్కువ బ్యాక్టీరియా కనిపించింది. పరిశోధనలో ఇతర గృహోపకరణాలను కూడా పరిశీలించారు. ఇందులో బాటిల్ పై కిచెన్ సింక్ కంటే రెట్టింపు బ్యాక్టీరియా కనిపించింది.

ఈ బ్యాక్టీరియా ఎందుకు ప్రమాదకరం?

ఈ పరిశోధనలో పరిశోధకులు రెండు రకాల బ్యాక్టీరియాను కనుగొన్నారు. వాటర్ బాటిల్ పై రెండు రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయని చెప్పారు. మొదటిది గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా, రెండవది బాసిల్లస్ బ్యాక్టీరియా.

ఈ బ్యాక్టీరియా నిజంగా ప్రమాదకరమా?

గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. న్యుమోనియా, రక్తప్రవాహ ఇన్ఫెక్షన్లు, గాయాలు, శస్త్రచికిత్స సైట్ ఇన్ఫెక్షన్లకు గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియా ప్రధాన కారణం. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. దీనితో పాటు యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది. 

బాసిల్లస్ బ్యాక్టీరియా

బాసిల్లస్ బ్యాక్టీరియా కడుపు సమస్యలు అంటే జీర్ణశయాంతర సమస్యలకు కారణమని చెప్తారు. దీని వల్ల కడుపులో ఇన్ఫెక్షన్, శరీర బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది కడుపు నొప్పి, ఫుడ్ పాయిజన్ కు కారణమవుతుంది.

వాటర్ బాటిళ్లతో పాటు కిచెన్ సింక్ లు, టీవీలు, ల్యాప్ టాప్ లు, మొబైల్స్, యూజ్డ్ మౌస్ వంటి ఇతర గృహోపకరణాలను కూడా బ్యాక్టీరియా ఆవాసాలుగా పరిగణిస్తున్నారు. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి. గాజు సీసాలు నీటిని నిల్వ చేయడానికి సురక్షితమైనవిగా భావిస్తారు. కానీ ఇది కూడా సురక్షితం కాదు. అందుకే రోజుకు ఒకసారి సబ్బుతో బాటిల్ కడుక్కోవాలని పరిశోధకులు సూచించారు. మొబైల్, ల్యాప్టాప్, కీబోర్డు, మౌస్, వర్కింగ్ డెస్క్ మొదలైన వాటిని తాకిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. 

PREV
click me!

Recommended Stories

Health: చాయ్‌తో వీటిని క‌లిపి తింటున్నారా.? తీవ్ర స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు
Mineral Water: మినరల్ వాటర్‌ను వేడిచేసి తాగడం మంచిదా? కాదా? తాగితే ఏమవుతుంది?