బెర్రీలను రోజూ తింటే ఎన్ని రోగాలు తగ్గిపోతాయో తెలుసా..!

By Mahesh Rajamoni  |  First Published Mar 17, 2023, 9:33 AM IST

నిజానికి బెర్రీలను తినే వారు చాలా తక్కువ మందే ఉన్నారు. కానీ స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, కోరిందకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తింటే ఎన్నో రోగాలు దూరమవుతాయి. 
 


పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ప్రతి పండు దాని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే పండ్లలో బెర్రీలను తక్కువగా తినేవారున్నారు. కానీ ఇతర పండ్ల మాదిరిగానే బెర్రీలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో  మేలు చేస్తాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు అంటూ రంగురంగులో ఉండే బెర్రీలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. బెర్రీలను రకరకాల ఫుడ్ లలో కలుపుతారు. ఐస్ క్రీములు, మ్యూసెలిస్, కేకులు, స్మూతీలల్లో కూడా ఉపయోగిస్తారు. బెర్రీలు పోషకాల బాండాగారం. ఈ పండ్లు అనేక వ్యాధుల ప్రమాదాన్ని నివారించడానికి సహాయపడుతుంది. కేవలం గుప్పెడు రంగురంగుల చిన్న పండ్ల విలువ ఎంతో పెద్దది. అసలు ఈ బెర్రీలను తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి: బెర్రీలు యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ఇది ఆంథోసైనిన్స్, ఎల్లాజిక్ ఆమ్లం, రెస్వెరాట్రాల్ కలిగి ఉంటుంది. ఈ పండ్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.

Latest Videos

undefined

రక్తంలో చక్కెరకు సహాయపడుతుంది: బెర్రీలు సహజంగా తీయగా ఉంటాయి. కానీ ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడతాయి. ఇది రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిల నుంచి కణాలను కాపాడుతుంది. 

ఫైబర్ : బెర్రీలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.  మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఇది మీరు కేలరీలు తీసుకోవడాన్ని మరింత తగ్గిస్తుంది. ఇవి తక్కువ కార్బ్ డైట్ కిందకు వస్తాయి.

మంటను తగ్గిస్తుంది: సంక్రమణ, గాయం మంట నుంచి రక్షించే మంచి శోథ నిరోధక లక్షణాలు బెర్రీల్లో పుష్కలంగా ఉంటాయి. 

హార్ట్ హెల్త్: బెర్రీలో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. ఇవి ఆరోగ్యకరమైన సూపర్ ఫుడ్స్  ఒకటిగా పరిగణించబడతాయి. ఈ పండ్లు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి  సహాయపడతాయి. అంతేకాదు కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఇవి కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. 

చర్మానికి మంచిది: బెర్రీలు చర్మం ముడతలను తగ్గించడానికి సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను నియంత్రించడానికి సహాయపడతాయ. ఇది వృద్ధాప్యానికి దారితీసే చర్మ నష్టానికి ప్రధాన కారణాలలో ఒకటి.

పోషకాలు ఎక్కువగా ఉంటాయి: బెర్రీలు పోషకాల బాండాగారం. రకరకాల బెర్రీల్లో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ కె, ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

click me!