ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఏం చేయకూడదో తెలుసా?

By Shivaleela RajamoniFirst Published Jul 7, 2024, 11:44 AM IST
Highlights

ఆరోగ్యం బాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ సూచించిన మందులను, మాత్రలను వాడుతుంటాం. ఈ మాత్రలు సరిగ్గా పనిచేయడాలంటే మాత్రం వీటిని వేసుకున్న తర్వాత మీరు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. 


జ్వరం లేదా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మందులను వాడుతుంటారు. ఇది  బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా నాన్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా కావొచ్చు. కానీ మీరు ఎలాంటి జబ్బులకైనా మందులను వాడుతున్నట్టైతే కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. కానీ చాలా మంది మెడిసిన్స్ ను తీసుకున్న తర్వాత కొన్నిమిస్టేక్స్ ను ఎక్కువగా చేస్తుంటారు. అవేంటి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మందులు పూర్తిగా తీసుకోవాలి

Latest Videos

మన వ్యాధిని బట్టి డాక్టర్ మనకు అవసరమైన మందులను సూచిస్తారు. ఎన్ని రోజులు కంటిన్యూగా వాడాలో కూడా చెప్తారు. కానీ చాలా మంది జబ్బు నుంచి కాస్త ఉపశమనం పొందగానే మందులను, ట్యాబ్లెట్లను వాడటం మానేస్తుంటారు. కానీ ఇలా చేయడం సరికాదు. ఎందుకంటే దీనివల్ల మీ ఆరోగ్యం పూర్తిగా సెట్ కాదు. మందులను డాక్టర్ సూచించిన రోజుల వాడకపోతే బ్యాక్టీరియా మీ శరీరంలో అలాగే ఉంటుంది. ఇది యాంటీబయాటిక్ నిరోధకతకు దారితీస్తుంది.

మందులను వేసుకున్న తర్వాత ఏవి తినకూడదు: ట్యాబ్లెటను వాడిన తర్వాత నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ వంటి పుల్లని పండ్లను తినకూడదని డాక్టర్లు చెప్తారు. ఎందుకంటే ఇవి మందుల శోషణకు, జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి.

పాల ఉత్పత్తులు: మందులు వేసుకున్న తర్వాత పాలు, పాల ఉత్పత్తులు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే పాలు, పెరుగు, జున్నుతో పాటుగా ఇతర పాల ఉత్పత్తులు కొన్ని కొన్ని సార్లు మందులతో సంకర్షణ చెందుతాయి. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. 

టైరామిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు: మోనోఅమైన్ ఆక్సిడేస్ ఇన్హిబిటర్స్ తో సంకర్షణ చెందే మందులు తీసుకునేటప్పుడు చాలా రోజు చీజ్, ప్రాసెస్ చేసిన మాంసాలు, కొన్ని పులియబెట్టిన ఆహారాలు వంటి టైరామిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకూడదు. ఎందుకంటే ఈ టైరామిన్ ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు సమస్య వస్తుంది. అలాగే శరీరంలో రక్తప్రసరణ తగ్గుతుంది. 

ఆకుకూరలు: ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ ఇవి రక్తం గడ్డకట్టడాన్ని ప్రభావితం చేసే మందులకు ఆటంకం కలిగిస్తాయి.  అందుకే ఈ మందులను వాడే వారు బచ్చలికూర, కాలే వంటి విటమిన్ కె ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం చాలా వరకు తగ్గించాలి. 

click me!