రాత్రి పొద్దుపోయే వరకు నిద్రపోకుండా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 21, 2024, 5:38 PM IST

చాలా మంది రాత్రిపూట బెడ్ మీద పడుకుని ఫోన్ చూస్తూనే ఉంటారు. ఎంత టైం అయ్యిందో అని కూడా తెలుసుకోరు. ఇలా ఫోన్ లో మునిగితే ఎప్పుడు పడుకుంటారో కూడా తెలియదు. కానీ అలవాటు మీ ఆరోగ్యాన్నైతే ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. 


రాత్రి టైం కు పడుకుని ఉదయం టైం కు నిద్రలేస్తే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. అయితే మన ఆరోగ్యానికి నిద్ర ఎంత ముఖ్యమో చాలా మందికి తెలియదు. అందుకే వీళ్లు ఎంత రాత్రి అయినా ఫోన్ చూస్తూనే ఉంటారు. రాత్రి పొద్దుపోయే వరకు ఫోన్ లోనే ముగినిపోతారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు పొద్దుపోయే దాకా నిద్రపోకపోవడం వల్ల ఎలాంటి  ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఆరోగ్య సమస్యలు

Latest Videos

ప్రతిరోజూ మీరు లేట్ గా నిద్రపోవడం వల్ల మీకు నిద్రలేమి సమస్య వస్తుంది. ఎందుకంటే తెల్లవారుజామున సరిగ్గా నిద్రపట్టదు. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. 

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

ప్రతిరోజూ మీరు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి. 

బరువు పెరుగుతారు

రెగ్యులర్ గా మీరు ఆలస్యంగా పడుకోవడం వల్ల మీ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. దీనివల్ల మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే గుండె జబ్బులు, జీర్ణక్రియ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

సామర్థ్యం కోల్పోవడం

రాత్రిపూట లేట్ గా పడుకునే అలవాటు.. మీరు ఉదయాన్నే నిద్రలేచే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా మీ దినచర్య దెబ్బతింటుంది.అలాగే మీరు ఆఫీసు పనులపై ఎక్కువ దృష్టి పెట్టలేరు. 

హార్మోన్ల అసమతుల్యత

రాత్రిపూట లేట్ గా నిద్రపోవడం వల్ల మీ హార్మోన్లను కూడా ప్రభావితం అవుతాయి. ఇది మీ శారీరక ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. హార్మోన్ల మార్పుల వల్ల బరువు పెరగడం, మెటబాలిజం తగ్గడం, మొటిమలు మొదలైన సమస్యలు వస్తాయి.

జీర్ణ సమస్యలు

రాత్రిపూట మీరు ఎక్కువ సేపు మెలుకువ ఉండటం వల్ల మీ జీర్ణక్రియ ప్రక్రియపై  చెడు ప్రభావం పడుతుంది. ఇది మీరు బరువు పెరగడంతో పాటుగా  ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. 
 

click me!