ఏం చేస్తే దగ్గు, జలుబు తొందరగా తగ్గుతాయో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 20, 2024, 4:43 PM IST

వానాకాలం మొదలవగానే దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో జలుబు ఎక్కువగా వస్తుంటుంది. ఈ జలుబు వారం రెండు మూడు వారాల పాటు కూడా ఉంటుంది. అయితే మీరు గనుక కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం దీన్ని తొందరగా తగ్గించుకోవచ్చు. అదెలాగంటే? 
 



వర్షాకాలం రాగానే రోగాలు రావడం కూడా షురూ అవుతుంది. మారిన వాతావరణం వల్ల దగ్గు, జలుబు, జ్వరంతో పాటుగా రకరకాల ఇన్ఫెక్షన్లు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో జలుబు సమస్య ఎక్కువగా వస్తుంటుంది. ఇది అంత సులువుగా తగ్గదు. ఒక్కసారి వచ్చిందంటే వారాల పాటూ ఉంటుంది. కానీ మీరు గనుక కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం జలుబుతో పాటుగా ఛాతీ నొప్పి, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యల నుంచి తొందరగా బయటపడతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పసుపు పాలు: పసుపు పాలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పసుపు పాలను తాగితే జలుబు తొందరగా తగ్గిపోతుంది. ఎలా అంటే పసుపు పాలు మన శరీరంలో వేడిని పెంచుతాయి. దీంతో కఫం సులభంగా కరిగిపోతుంది. పసుపు మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. ఇది మీకు వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

Latest Videos

ఉల్లిపాయ వాటర్: ఉల్లిపాయ వాటర్ కూడా మీకున్న దగ్గును, జలుబును, గొంతునొప్పిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఉల్లిపాయను తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీన్ని 5 గంటల పాటు నీటిలో నానబెట్టి రోజూ తాగితే ఛాతీలో కఫం పోతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఆవనూనె:  ఆవాల నూనె కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. జలుబు తగ్గడానికి ఆవ నూనెను గోరువెచ్చగా చేసి ఛాతీపై మర్దన చేయాలి. దీనివల్ల కఫం కరిగిపోతుంది. వెల్లుల్లిని ఆవనూనెతో మర్దన  చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. 

అల్లం టీ: అల్లం టీ కూడా జలుబును తొందరగా తగ్గిస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది గొంతు, ఛాతీ నుంచి అదనపు శ్లేష్మాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీని కోసం అల్లం తొక్క తీసి వేడి నీటిలో మరగబెట్టి టీని తయారు చేసి తాగండి. 

లవంగం టీ:  లవంగం టీ కూడా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందుకోసం రెండు లవంగాలు, దాల్చిన చెక్క ముక్కను నీటిలో వేసి మరిగించండి. దీనిలో తేనె కలుపుకుని తాగితే ఛాతీ శ్లేష్మం, శ్వాసకోశ, ఊపిరితిత్తులలోని ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.  అయితే శ్లేష్మం పసుపు లేదా ఎరుపు రంగులో ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. ఎందుకంటే ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు సంకేతం. 

click me!