అరచేతులను రుద్దడం వల్ల ఏమౌతుందో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Aug 24, 2024, 1:51 PM IST

రెండు అరచేతులను కలిపి రుద్దడం మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మన శరీరంలో వేడి ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే శరీరానికి శక్తిని ఇస్తుంది..ఇంతేకాదు.. 
 


అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా చాలా చలిగా అనిపించినప్పుడు రెండు అరచేతులను, కాళ్లను రుద్దుతుంటారు. నిజానికి దీనివల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేదం లేదా యోగా రెండింటిలో.. అరచేతులను కాసేపు రుద్దడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మీకు తెలుసా? అరచేతులను కలిపి రుద్దినప్పుడు ఒంట్లో వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది మన శరీరానికి శక్తిని అందిస్తుంది అలాగే ఒంట్లో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. రోజూ కాసేపు చేతులు కలిపి రుద్దడం ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

శరీరానికి శక్తి

Latest Videos

మీకు తెలుసా? మన అరచేతులలో ఎన్నో ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఎన్నో భాగాలతో అనుసంధానించబడి ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు రెండు అరచేతులను కలిపి రుద్దినప్పుడు చేతుల్లో వేడి;  శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతాయి. దీంతో రక్తం శరీరమంతా బాగా ప్రసరిస్తుంది.

కంటి ఆరోగ్యం

రెండు చేతులను కలిపి రుద్దినప్పుడు కంటి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.నిజానికి అరచేతుల వెచ్చదనం మన కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది కళ్ళ చుట్టూ రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. దీంతో కంటి అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది. 

మెరుగైన రక్త ప్రసరణ

అరచేతులను కలిపి రుద్దడం వల్ల మన  శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల శరీరం వేడిని బాగా ఉత్పత్తి చేస్తుంది. అలాగే దీంతో మీరు చురుగ్గా ఉంటారు. 

మెరుగైన మెదడు పనితీరు

చేతులను రుద్ది కళ్లకు అద్దుకోవడం వల్ల మన మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మన మనస్సులో మంచి ఆలోచనలు వస్తాయని, రోజంతా పాజిటివిటీతో పాటు ఆత్మవిశ్వాసంతో ఉంటామని నిపుణులు అంటున్నారు. 

జలుబును దూరం

చలికాలంలో చల్లని చేతులను కలిపి రుద్దడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మన శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. అలాగే చలిపెట్టిన అనుభూతి చాలా వరకు తగ్గుతుంది. 

click me!