
Ramadan 2023: రంజాన్ ఉపవాసం ఆత్మపరిశీలన, జ్ఞానోదయం, కరుణ, భక్తికి ప్రత్యేక పవిత్ర సమయం. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రోజంతా ఉపవాసం ఉండి ఉదయం, రాత్రి వేళల్లో రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. రంజాన్ 12 నుంచి 14 గంటల ఉపవాసం అడపాదడపా ఉపవాసం మాదిరిగానే ఉంటుందని మీకు తెలుసా? అవును రంజాన్ అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నెల రోజుల పాటు ఏమీ తినకుండా, త్రాగకుండా ఉండటం. ఇఫ్తార్, రాత్రి భోజనం సమయంలోనే ఉపవాసాన్ని విరమిస్తారు.
రంజాన్ అడపాదడపా ఉపవాసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఉపవాసం జీర్ణవ్యవస్థను రీసెట్ చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది. అంతేకాదు ఆరోగ్యంగా బరువు కూడా తగ్గుతారు. పవిత్ర రంజాన్ మాసంలో అడపాదడపా ఉపవాసం చేయడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గుతారు
రంజాన్ ఉపవాసం బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంతో పాటు, కేలరీల లోటును కూడా తీరుస్తుంది. అలాగే అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అలాగే మెదడు పనితీరును కాపాడుతుంది.
జీవక్రియ పెరుగుతుంది
అడపాదడపా ఉపవాసం జీవక్రియ రేటును పెంచుతుందని అధ్యయనాలు నిరూపించబడింది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఒక నెల రోజులు ఉపవాసం ఉండటం వల్ల హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ రెండూ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మంట నుంచి ఉపశమనం
రంజాన్ లో అడపాదడపా ఉపవాసం ఉండటం వల్ల వృద్ధాప్యంలో ప్రధాన కారకమైన మంట నుంచి ఉపశమనం పొందుతారు. ఉపవాసం ఫలితంగా మీ గట్ మైక్రోబయోటా మారుతుంది. ఉపవాసం తర్వాత గట్ మైక్రోబయోమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగున్న బ్యాక్టీరియాతో ఎక్కువగా ఉంటుంది.
శరీరంలోని విషాన్ని బయటకు పంపుతుంది
ఆహారపు అలవాట్లలో మార్పు, ఆధ్యాత్మిక ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రంజాన్ వారి అప్రమత్తత, దృష్టి స్థాయిని పెంచుతుందని కొందరు భావిస్తారు. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది.
మెదడు ఆరోగ్యం
మెదడు ఆరోగ్యానికి అవసరమైన అనేక జీవక్రియ ప్రక్రియలు అడపాదడపా ఉపవాసం ద్వారా మెరుగుపడతాయి. తగ్గిన ఆక్సీకరణ ఒత్తిడి, మంట, రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ నిరోధకత అన్నీ అడపాదడపా ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు.