ప్రొస్టేట్ క్యాన్సర్ రావొద్దంటే రోజూ ఇలా చేయండి

By Mahesh RajamoniFirst Published May 28, 2023, 1:58 PM IST
Highlights

ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలను అంత తొందరగా చూపదు. కొందరిలో మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే దీనినుంచి బయటపడొచ్చు. 
 

ప్రోస్టేట్ క్యాన్సర్.. పురుషులలో ప్రోస్టేట్ గ్రంథిని ప్రభావితం చేసే క్యాన్సర్. ఇది పురుషులకు వవచ్చే సర్వ సాధారణమైన క్యాన్సర్లలో ఒకటి. ప్రోస్టేట్ గ్రంథి అత్యంత ముఖ్యమైన పునరుత్పత్తి అవయవాలలో ఒకటి. స్పెర్మ్ కదలికకు సహాయపడే స్పెర్మ్ ను ఉత్పత్తి చేయడం దీని ప్రధాన విధి.

ప్రోస్టేట్ క్యాన్సర్ లో లక్షణాలు అంత స్పష్టంగా ఉండవు. ఫలితంగా వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేయలేం. దీనితో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రాణాంతక దశకు చేరుకుంటుంది. ఈ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం కూడా ఉంది. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ను నివారించడానికి కొన్ని జీవనశైలి చిట్కాలు ఉపయోగపడతాయి. అవేంటంటే.. 

వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాయామం మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ ను కూడా నివారిస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం

ఆహారానికి, ఆరోగ్యానికి చాలా సంబంధం ఉందని అందరికీ తెలుసు. ఆరోగ్యంకరమైన ఆహారం ఎన్నో వ్యాధులను నయం చేస్తుంది. అందుకే మీరు తినే ఆహారంలో ఎక్కువ కూరగాయలు, పండ్లను చేర్చుకోండి. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ ను కొంతవరకు నివారిస్తుంది. 

బరువు

వయసు, ఆరోగ్య పరిస్థితులకు తగ్గట్టుగా శరీర బరువును ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనిద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ ను కూడా నివారించొచ్చు. స్థూలకాయులైన పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 

టెస్టులు

కొంతమంది పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే మీరే స్వయంగా గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే డాక్టర్ దగ్గరకు ఖచ్చితంగా వెళ్లండి. అలాగే అవసరమైన పరీక్షలు చేయించుకోండి. లేదా ఈ విషయంలో నిర్ధారణ పొందడానికి అవసరమైన సూచనలను పొందండి. 

విటమిన్ డి 

మీ శరీరంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటే ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. విటమిన్-డి ప్రోస్టేట్ క్యాన్సర్ తో పోరాడటానికి సహాయపడుతుంది. సూర్యరశ్మితో పాటు, కాడ్ లివర్ ఆయిల్, వైల్డ్ సాల్మన్ వంటి విటమిన్-డి ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. 

click me!