మీ కళ్లు ఎప్పుడూ ఎర్రగా ఉంటున్నాయా?

By Mahesh RajamoniFirst Published May 23, 2023, 3:58 PM IST
Highlights

కళ్లు ఎర్రగా మారడం ఒక సాధారణ సమస్య. కానీ ఎప్పుడూ మీ కళ్లు ఎర్రగా ఉంటే మాత్రం ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. లేదా కొన్ని ఇంటి చిట్కాలను పాటించినా ఈ సమస్య తగ్గిపోతుంది. 
 

ప్రతి ఒక్కరి శరీరంలో అత్యంత ముఖ్యమైన, సున్నితమైన అవయవాలలో కన్ను ఒకటి. కంటి సమస్యలు మన శరీరానికి ఎన్నో సమస్యలను కలిగిస్తాయి. చిన్న సమస్యే అయినా రోజువారీ పనిపై దాని ప్రభావం పడుతుంది. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావొచ్చు. కళ్లు ఎర్రగా ఉన్నప్పుడు కంటిలో రక్తం పడ్డట్టుగా అనిపిస్తుంది. అసలు ఈ సమస్యకు కారణాలేంటి? దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కంటిలోని చిన్న రక్త నాళాలు ఎర్రబడినప్పుడు లేదా నాళాలు వాపునకు గురైనప్పుడు ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అంతేకాదు కళ్లు ఎర్రబడటానికి కంటిలో చికాకు, తగినంత నిద్ర లేకపోవడం, కంటిపై ఎక్కువ ఒత్తిడి వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కళ్లు ఎర్రబడే సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఏ హోం రెమెడీస్ ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కళ్ళు ఎర్రబడటానికి కారణమేమిటి?

పబ్ మెడ్ సెంట్రల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. కళ్లు ఎర్రబడటానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. దుమ్ము, పొగ, కంటిలో కన్నీళ్లు లేకపోవడం, కంటి చికాకు, కనురెప్ప దెబ్బతినడం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. కన్ను ఎర్రగా ఉంటే కంటి నిపుణుడు లేదా కంటి డాక్టర్ వద్దకు మాత్రమే వెళ్లాలి. వీళ్లే కంటికి సరైన చికిత్స చేస్తారు. 

కలబంద

కలబంద మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఇది మన శరీరాన్ని వ్యాధి రహితంగా చేయడానికి సహాయపడుతుంది. కలబంద కళ్లు ఎర్రబడే సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ 1 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. కలబంద కళ్ల వాపును తగ్గించనట్టు తేలింది. కలబంద మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. దీని వాడకం వల్ల కళ్లు ఎర్రబడే సమస్య తగ్గుతుంది. ఇందుకోసం కలబంద జెల్ లేదా రసాన్ని కంటిపై వర్తించొచ్చు.

కొబ్బరినూనెను అప్లై చేయండి

కళ్లు ఎర్రగా మారే వారికి కొబ్బరి నూనె బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో విటమిన్ కె, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ నూనె కళ్లు పొడిబారడం, చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని కళ్లలో వేసుకోవాలంటే కొద్దిగా ఆర్గానిక్ కొబ్బరినూనెను వాడాలి. ఇది కళ్లకు ఉపశమనం కలిగిస్తుంది.

ఐస్ 

కన్ను ఎర్రగా, వాపుగా ఉన్నప్పుడు ఐస్ ను ఉపయోగించండి. ఇందుకోసం శుభ్రమైన బట్టలో చిన్న ఐస్ ముక్కను తీసుకోండి. దానిని మీ కంటిపై ఉంచండి. కంటి చుట్టూ కదిలించండి. మూడు, నాలుగు నిమిషాల తర్వాత ఐస్ ముక్కను తీసేసి దానిపై చల్లని బట్టను పెట్టండి. ఇన్వెస్టిగేటివ్ ఆప్తాల్మాలజీ అండ్ విజువల్ సైన్స్ ..జూన్ 2013 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. ఎర్రని కళ్లకు కోల్డ్ కంప్రెస్లను సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగించినట్లు నివేదించింది. దీని వాడకం కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.

click me!