ఎండాకాలంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండాలంటే ఇలా చేయండి..

By Mahesh RajamoniFirst Published Mar 21, 2023, 2:41 PM IST
Highlights

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి సహాయపడతాయి. ఎందుకంటే ఇవి చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి. అలాగే రక్తంలో చక్కెర పెరుగుదలను నిరోధిస్తాయి. ఈ ఫుడ్స్ బరువు తగ్గేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. 
 

మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరకంగా చురుకుగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ఆరోగ్యకరమైన బరువు ఉండటం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అయితే వాతావరణ మార్పులు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. 

ఎండాకాలంలో మధుమేహులు ఎక్కువగా అలసిపోతారు. ఎందుకంటే ఇది చెమట గ్రంథులను ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ పేషెంట్లు శరీరంలోని నీటిని త్వరగా కోల్పోవచ్చు. ఎందుకంటే అధిక చక్కెర స్థాయిలు ఎక్కువ మూత్ర విసర్జనకు దారితీస్తుంది. ఇది వారిని నిర్జలీకరణానికి గురి చేస్తుంది. 

డయాబెటిస్ లో రెండు ప్రధానంగా రకాలు ఉన్నాయి. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్. అయితే  టైప్ 1 డయాబెటిస్ లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. ఎందుకంటే శరీరం రోగనిరోధక వ్యవస్థ ఇన్సులిన్ తయారు చేసే ప్యాంక్రియాస్ లోని ఐలెట్ కణాలపై దాడి చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ లో ప్యాంక్రియాస్ మునుపటి కంటే తక్కువ ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. శరీరం ఇన్సులిన్ కు నిరోధకతను కలిగి ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు వారి రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఎండాకాలంలో ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

వ్యాయామం

ఎండాకాలంలో మధుమేహాన్ని నియంత్రించడానికి వ్యాయామం ఎంతో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళ 30 నిమిషాలు ఖచ్చితంగా నడవటానికి ప్రయత్నించండి. తిన్న 1-3 గంటల తర్వాత తేలికపాటి వ్యాయామాలు చేయండి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా నియంత్రణలో ఉంటాయి. 

అధిక ఫైబర్ ఫుడ్

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారం డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో సహాయపడుతుంది. ఫైబర్ రిచ్ ఫుడ్స్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. అలాగే రక్తంలో చక్కెర పెరుగుదలను నిరోధిస్తాయి. ఇలాంటి ఆహారాలు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇది డయాబెటిస్ ను బాగా నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే రక్తపోటు, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నివారిస్తుంది. ఓట్స్, బ్రౌన్ రైస్, తృణధాన్యాలు, పండ్లు, విత్తనాలు, గింజలు, క్యారెట్లు, టమోటాలు వంటి కూరగాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 
 
జ్యూస్ లు

ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచేందుకని చాలా మంది రకరకాల జ్యూస్ లను తాగుతుంటారు. కానీ డయాబెటిస్ ఉన్నవారికి ఫైబర్ ఎక్కువగా లేని ఆహారాలు అంత మంచివి కావు. ఎందుకంటే ఇవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. 

నీళ్లు

నీరు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది. అందుకే ఈ ఎండాకాలంలో పుష్కలంగా నీటిని తాగండి. అలాగే డ్రేటింగ్ ఆహారాలు తినండి. 


 

click me!