
ప్రస్తుత కాలలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. దశాబ్ద కాలంలో భారత్ లో డయాబెటీస్ పేషెంట్ సంఖ్య ఎక్కువగా పెరిగిందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కుటుంబ చరిత్ర, వయసు పెరగడం వల్ల ఈ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు అనారోగ్యకరమైన ఆహారాలను తినడం, జీవన శైలి సరిగ్గా లేకపోవడం వంటి అలవాట్లు కూడా ఈ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మీరు ఎలాంటి ఆహారాలను తింటున్నారు? ఎలాంటి లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తున్నారు అనేది కూడా మీ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందంటున్నారు నిపుణులు. మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ.. కొన్ని చిన్న చిన్న అలవాట్లు కూడా మీ రక్తంలో చక్కరను అమాంతం పెంచేస్తాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం తెలిసో, తెలియకో కొన్ని మిస్టేక్స్ ను చేస్తుంటాం. కానీ ఇవి మధుమేహం వచ్చే ప్రమాదాన్ని బాగా పెంచుతాయి. అయితే డయాబెటీస్ ఉన్నవారు కొన్ని తప్పులను అసలే చేయకూడదు. ఎందుకంటే ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. అవేంటంటే..
వైట్ బ్రెడ్ ను తినకూడదు
వైట్ బ్రెడ్ ను చాలా మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా తింటుంటారు. కానీ దీనిలో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ వైట్ బ్రెడ్ శుద్ధి చేసిన పిండితో తయారుచేస్తారు. దీనిలో ఉండే పిండిపదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు వీటిని అసలే తినకూడదు. అంతేకాదు శుద్ధి చేసిన అన్ని రకాల పిండి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. బిస్కెట్లు, పాస్త, కేకులు, వైట్ రైస్, స్వీట్లు, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో కూడా శుద్ది చేసిన పిండి పదార్థాలు ఉంటాయి.
బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయకూడదు
చాలా మంది పని హడావుడిలో పడి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. కానీ డయాబెటీస్ పేషెంట్లు బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకే మధుమేహులు ఎట్టి పరిస్థితిలోనైనా అల్పాహాన్ని తినాలి. ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన అనేక పరిశోధనలు అల్పాహారం తినని వారికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఏమీ తినకపోవడం, ఉదయం కూడా ఏమీ తినకపోవడం వల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్లస్ బాగా పెరుగుతాయి.
ఎప్పుడూ కూర్చోవడం
డయాబెటీస్ రోగులు తప్పకుండా శారీరక శ్రమ చేయాలి. ఇంట్లో, ఆఫీసుల్లో ఎక్కువ సేపు కూర్చునే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 2021 లో 475 మందికి పైగా జరిపిన ఒక అధ్యయనంలో జీవన శైలి సరిగ్గా లేకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం 2 శాతం పెరుగుతుందని కనుగొంది.
ఒంటరితనం
కరోనా మహమ్మారి విజృంభించిన ఏడాది తర్వాత అమెరికాలో నిర్వహించిన ఒక సర్వేలో దీర్ఘకాలిక ఒంటరితనం కూడా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని కనుగొన్నారు. డయాబెటీస్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఒంటరిగా బ్రతికే ప్రజలు ఉన్నారని పరిశోధకులు నివేదించారు. ఒంటరిగా ఉండే వారికి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.