ఈ మూలికలతో ఒత్తిడి, అలసట, చికాకు మటుమాయం..!

Published : Apr 16, 2023, 03:15 PM IST
ఈ మూలికలతో ఒత్తిడి, అలసట, చికాకు మటుమాయం..!

సారాంశం

కొన్ని రకాల మూలికల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే వీటిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఒత్తిడి, అలసట, చికాకును తగ్గించడానికి కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి.   

అడాప్టోజెనిక్ మూలికలతో ఎన్నో సమస్యలను తగ్గిస్తోంది ఆయుర్వేదం. ఈ మూలికలు ఎన్నో రకాల వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. అడాప్టోజెనిక్ మూలికలు ఒత్తిడిని ఎదుర్కోవటానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఎన్నో రకాల ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. అడాప్టోజెనిక్ మూలికలు ఒత్తిడి ప్రభావాలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. 

అడాప్టోజెనిక్ హెర్బ్స్ అంటే ఏమిటి? 

అడాప్టోజెనిక్ కొన్ని మొక్కలు, పుట్టగొడుగులలో క్రియాశీల పదార్థాలు ఉంటాయి. ఇవి మన శరీరం ఒత్తిడి, ఆందోళన, అలసటను ఎదుర్కొనే విధంగా ప్రభావితం చేస్తాయి. ఒత్తిడిని, అలసటను తగ్గించడానికి ఎలాంటి మూలికలు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

అశ్వగంధ

ఒత్తిడి ప్రభావాలను తగ్గించడానికి అశ్వగంధ ఎంతగానో సహాయపడుతుంది. ఇది శరీర పనితీరును బలోపేతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అశ్వగంధ విశ్రాంతి, ప్రశాంతతను కలిగిస్తుంది. శరీరమంతా సమతుల్యతను నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే నాడీ వ్యవస్థను సడలించడానికి సహాయపడుతుంది. అశ్వగంధను టీలో లేదా సప్లిమెంట్ గా ఎక్కువగా తీసుకుంటారు. అశ్వగంధ జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మూలిక ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది.

తులసి ఆకులు

తులసి ఆకుల్లో ఎన్నో ఔషద గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, డైజెస్టివ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని టీ, కషాయం, అనేక ఇతర వంటలలో వేసుకుని తినొచ్చు. ఈ ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తులసి ఆకులు మీ శరీరాన్ని శాంతపరచడానికి, శక్తిని ఇవ్వడానికి బాగా పని చేస్తాయి.

ఉసిరి

ఉసిరి ఒక సూపర్ ఫుడ్. ఇది సహజ విటమిన్ సి కి మంచి మూలం. ఉసిరి మీ రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఉసిరికాయ మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఉసిరికాయ తినడం వల్ల ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

ఆస్పరాగస్ 

ఆయుర్వేదంలో మూలికలు చాలా సాధారణమైనవిగా భావిస్తారు. ఆస్పరాగస్ అడాప్టోజెనిక్ స్త్రీ పునరుత్పత్తి టానిక్ గా ప్రాచుర్యం పొందింది. తల్లి పాలిచ్చే మహిళలు శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవటానికి కూడా ఇది సహాయపడుతుంది. అజీర్ణం, జ్వరం, గ్యాస్ట్రిక్ అల్సర్లను  తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. దీనిని పౌడర్, టాబ్లెట్ రూపంలో తీసుకోవచ్చు.

బ్రాహ్మీ

బ్రహ్మీ మెదడుకు పోషణను అందిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి కూడా దోహదపడుతుంది.  బ్రహ్మీని జ్యూస్, పౌడర్ లేదా క్యాప్సూల్స్ రూపంలో తీసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Fatty Liver: కొంచెం తిన్నా కడుపు ఉబ్బుతోందా.? ఫ్యాటీ లివ‌ర్ కావొచ్చు, అల‌ర్ట్ అవ్వండి
Pomegranate: రోజుకో దానిమ్మ పండు తింటే ఏమవుతుంది? ఎవరు అస్సలు తినకూడదు?