ఎండాకాలంలో గర్భిణులు ఈ ఫుడ్స్ ను తప్పకుండా తినాలి.. ఎందుకంటే..?

By Mahesh RajamoniFirst Published Mar 28, 2023, 12:02 PM IST
Highlights

మీరు తల్లికాబోతున్నారా? అయితే ఈ సీజన్ లో కొన్ని ఫుడ్స్ ను మీ డైట్ లో తప్పకుండా చేర్చుకోండి. ఎందుకంటే ఇవి తల్లినీ, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి.
 


సీజన్ తో సంబంధం లేకుండా.. కాబోయే తల్లులు సాధారణంగా గర్భధారణ సమయంలో తినే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకునే పోషకాల నుంచే శిశువుకు అన్ని పోషకాలు అందుతాయి. అయితే గర్భధారణ సమయంలో ఎండాకాలంలో కొన్ని రకాల ఆహారాలను తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

గర్భిణీ స్త్రీలకు వేసవి ఆహారం

శిశువును ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రెగ్నెన్సీ సమయంలో జీవనశైలిపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా వేసవిలో.. మనలో చాలా మంది ఈ ఎండాకాలంలో తక్కువ తింటారు. తక్కువ వాటర్ ను తాగుతారు. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. ఇది శిశువు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. గర్భిణీ స్త్రీలు వేసవి వేడిని ఎదుర్కోవటానికి సురక్షితమైన గర్భం కోసం పోషకాహారాలను తీసుకోవాలి. గర్భిణులు ఆరోగ్యంగా ఉండేందుకు సమ్మర్ లో ఎలాంటి ఆహాకాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆకుకూరలు

బచ్చలికూర, కాలే, బ్రోకలీ వంటి ఆకుకూరలలో ఫోలేట్, ఐరన్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిండం అభివృద్ధికి ఫోలేట్ చాలా అవసరం. ముఖ్యంగా పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇనుము చాలా అవసరం. గర్భధారణ సమయంలో రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. కాల్షియం పిండం ఎముక అభివృద్ధికి సహాయపడుతుంది. 

పండ్లు

నారింజ, బెర్రీలు, అరటిపండ్లు, ఆపిల్, పియర్స్ వంటి పండ్లలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ తో పాటుగా ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి ఇనుము శోషణకు సహాయపడుతుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రక్తపోటును నియంత్రించడానికి పొటాషియం సహాయపడుతుంది. 

లీన్ ప్రోటీన్

చికెన్, చేపలు, టర్కీ, టోఫు వంటి లీన్ ప్రోటీన్ వనరుల్లో ఇనుము, జింక్, విటమిన్ బి 12 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పిండం పెరుగుదల, అభివృద్ధికి ఇనుము అవసరం. అయితే పిండం రోగనిరోధక పనితీరుకు, కణాల పెరుగుదలకు జింక్ ఎంతో ఉపయోగపడుతుంది. పిండం మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి విటమిన్ బి 12 సహాయపడుతుంది. 

తృణధాన్యాలు

బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్ బ్రెడ్ వంటి తృణధాన్యాల్లో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉంటాయి.  సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శక్తికి మంచి మూలం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. అయితే దీనిలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారించడానికి, ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

గింజలు, విత్తనాలు

బాదం, వాల్ నట్స్, చియా విత్తనాలు, అవిసె గింజలు వంటి గింజలు, విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు పిండం మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. అయితే పిండం కణాల పెరుగుదల, అభివృద్ధికి విటమిన్ ఇ కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. కండరాలను ఆరోగ్యంగా ఉంచేందుకు, నరాల పనితీరును మెరుగుపర్చచడానికి సహాయపడుతుంది. 
 

click me!