దోమలు కొంతమందినే ఎందుకు కుడతాయో తెలుసా?

By Shivaleela RajamoniFirst Published Aug 29, 2024, 3:55 PM IST
Highlights

మీరు గమనించారో లేదో కానీ దోమలు కొంతమందిని మాత్రమే ఎక్కువగా కుడుతుంటాయి. అసలు ఇలా దోమలు ఎందుకు చేస్తాయో తెలుసుకుందాం పదండి. 

వర్షాకాలంలో దోమల బెడద విపరీతంగా ఉంటుంది. ఉదయ, రాత్రి అంటూ తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కుడుతూనే ఉంటాయి. కానీ ఈ దోమ కాటు వల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. 

అయితే ఈ దోమలు అందరినీ కుట్టినా ..కొంతమందిని మాత్రం ఎక్కువగా కుడుతాయని కొందరు అంటుంటారు. మరికొంతమంది అయితే మీ రక్తం తీయగా ఉన్నట్టుంది అందుకే నిన్నే ఎక్కువగా కుడుతున్నాయని ఎగతాళి కూడా చేస్తుంటారు. మీరు కూడా  ఇలాంటి వ్యక్తుల్లో ఒకరా? అసలు దోమలు ఎందుకు కొందరినే ఎక్కువ కూడతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos

దోమలు ఎందుకు కొంతమందిని ఎక్కువగా కుడతాయి? 

1. చెమట : మీకు తెలుసా? మనుషుల చెమట వాసన దోమలను బాగా ఆకర్షిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంటే చెమల ఎక్కువగా పట్టే వారినే దోమలు ఎక్కువగా కుడతాయన్న మాట. ఎందుకంటే చెమటలో లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, అమైనో యాసిడ్స్ వంటి భాగాలు ఉంటాయి. ఇది  ఆడ దోమలను ఆకర్షిస్తుంది. అందుకే  ఇలాంటి వారిని దోమలు ఎక్కువగా చుట్టుముడతాయి. 

2. శరీర ఉష్ణోగ్రత : చెమటతో పాటుగా మీ శరీరం ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసినా లేదా ఇతరుల కంటే మీ శరీర ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువగా ఉన్నా.. దోమలు మిమ్మల్నే ఎక్కువ కుడతాయి.ఉదాహరణకు.. ఊబకాయం ఉన్నవారు లేదా అథ్లెట్లు ఎక్కువ జీవక్రియ రేటును కలిగి ఉంటారు. కాబట్టి వీరి శరీరం ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. అందుకే దోమలు వీరిని ఎక్కువగా కుడతాయి.

3. రక్తం : ఎన్నో పరిశోధనల ప్రకారం.. 'O' రక్తం ఉన్నవారిని ఇతరుల కంటే దోమలు ఎక్కువగా కుడతాయని తేల్చాయి. పరిశోధనల ప్రకారం.. ఈ రక్తం ఉన్నవారు నిర్దిష్ట రసాయనాలను విడుదల చేస్తారని అంచనా వేయబడింది. ఇది దోమలను ఆకర్షిస్తుంది. 

4. దుస్తుల రంగు :   దోమలు కొన్ని రంగులకు కూడా బాగా ఆకర్షించడతాయి. ముఖ్యంగా దోమలు ముదురు రంగులకు ఎక్కువగా ఆకర్షితులవుతాయట. అలాంటప్పుడు ముదురు రంగు దుస్తులు ధరించిన వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. 

5. గర్భధారణ : గర్భధారణ సమయంలో కూడా దోమలు స్త్రీలకు ఎక్కువగా ఆకర్షితులవుతాయి. ఎందుకంటే వారి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తారు.

6. మద్యపానం : పలు పరిశోధన ప్రకారం..బీరు తాగేవారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయి. ఎందుకంటే మద్యంలో ఎక్కువ మొత్తంలో ఇథనాల్ ఉంటుంది.ఈ ఇథనాల్ వాసన దోమలను ఆకర్షిస్తుంది. అందుకే మందు తాగేవారిని దోమలు ఎక్కువగా కుడతాయి.

నిద్రపోతున్నప్పుడు దోమలు ఎందుకు కుడతాయి?:

నిద్రపోతున్నప్పుడు దోమలు ఎందుకు ఎక్కువగా కుడతాయెందుకు అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. నిజానికి దీనికి కారణం కార్బన్ డయాక్సైడ్. పరిశోధన ప్రకారం.. మన శరీరం పగటి కంటే రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ వాసన దోమలను ఆకర్షిస్తుంది. అందుకే నిద్రపోతున్నప్పుడు దోమలు ఎక్కువగా కుడతాయి.

 

click me!