ఉదయాన్నే తులసి వాటర్ తాగితే ఇన్ని లాభాలున్నాయా?

By Shivaleela Rajamoni  |  First Published Aug 28, 2024, 11:37 AM IST

ఈ రోజుల్లో దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈ తులసి ఆకులు మన ఆరోగ్యానికి దివ్య ఔషదంలా పనిచేస్తాయి. అవును ఆకులను నీళ్లలో నానబెట్టి తాగితే ఎన్నో రోగాలు ఇట్టే తగ్గిపోతాయి. 
 


మన దేశంలో ఎన్నో శతాబ్దాలుగా తులసి మొక్కను పూజిస్తూ వస్తున్నారు. అందుకే ఈ మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఈ మొక్క పవిత్రమైనదే కాదు.. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే దీన్ని ఎన్నో వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. రోజూ కొన్ని తులసి ఆకులను తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తులసి ఆకులను కాసేపు నీటిలో నానబెట్టి ఆ వాటర్ ను తాగితే మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తులసి వాటర్ ను ఉదయాన్నే పరిగడుపున తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒత్తిడి దూరమవుతుంది

Latest Videos

మీకు తెలుసా? తులసి ఆకుల్లో ఎక్కువ మొత్తంలో అడాప్టోజెన్లను ఉంటాయి. ఇవి మన శరీరంలో ఒత్తిడి లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది మన నాడీ వ్యవస్థను సడలించడానికి, రక్త ప్రవాహాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది ఇంద్రియాలను కూడా శాంతపరుస్తుంది. స్ట్రెస్ ను ఇట్టే తగ్గిస్తుంది. 

మెరుగైన జీర్ణక్రియ

తులసి వాటర్ ను ప్రతిరోజూ తాగితే మీ ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. దీంతో జీర్ణక్రియను సులభతరం అవుతుంది. ఈ వాటర్ యాసిడ్ రిఫ్లక్స్ ను కూడా సమతుల్యం చేస్తుంది. అలాగే పీహెచ్ లెవెల్స్ ను  నిర్వహిస్తుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.

నోటి దుర్వాసనను తగ్గిస్తుంది

తులసి ఆకులు నోటి దుర్వాసనను తగ్గించడానికి కూడా బాగా సహాయపడతాయి. ఈ ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. ఈ వాటర్ ను ఉదయాన్నే తాగితే నోరు ఫ్రెష్ గా ఉంటుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. తులసి ఆకులు బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడుతాయి. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

తులసి ఆకులు మన జీర్ణక్రియకు సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మీ శరీరం నుంచి విష పదార్థాలు బయటకు పోతాయి. ఈ వాటర్ ను ప్రతిరోజూ తాగితే మీ జీవక్రియను నియంత్రణలో ఉంటుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
 
 

click me!